Begin typing your search above and press return to search.

ఏనుగులకు ఆడిషన్స్‌ నిర్వహించారట

By:  Tupaki Desk   |   14 Feb 2020 4:42 PM IST
ఏనుగులకు ఆడిషన్స్‌ నిర్వహించారట
X
రానా హీరోగా నటించిన ‘హాథీ మేరీ సాథి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఏప్రిల్‌ 2న హిందీ.. తెలుగు.. తమిళంలో పెద్ద ఎత్తున విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంను తెలుగులో అరణ్యగా.. తమిళంలో కాండన్‌ పేర్లతో విడుదల చేయబోతున్నారు. అరణ్య పాత్రలో రానా కనిపించబోతున్నాడు. రానా ఒక అడవి మనిషి తరహాలో ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. అడవే సర్వస్వం.. ఏనుగులే జీవితంగా అతడి జీవితం సాగుతున్న సమయంలో ఎదురైన అనుభవాల సమాహారంగా ఈ చిత్రం రూపొందిందట.

ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల సందర్బంగా రానా మాట్లాడుతూ... అస్సాంలోని జాదవ్‌ ప్రియాంక్‌ అనే వ్యక్తి 1300 ఎకరాల్లో అడవిని పెంచాడు. అతడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కోసం పని చేస్తున్న సమయంలో ఫోన్‌ లేదు.. కనీసం సహ నటులు కూడా లేదు. చాలా రోజుల పాటు కేవలం నాపైనే షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. జీవితం అంటే ఏంటీ అనేది అరణ్య పాత్రలో నటిస్తే నాకు అర్థం అయ్యిందన్నాడు.

ఇక దర్శకుడు ప్రభు సాల్మన్‌ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథకు సురేష్‌ బాబు గారు వెంటనే ఓకే చెప్పారు. కథ బాగా నచ్చడంతో తర్వాత రోజే సినిమా వర్క్‌ స్టార్ట్‌ చేయాలని సూచించారు. ఈ సినిమాలో 30 ఏనుగులు కనిపిస్తాయి. ఆ 30 ఎనుగుల్లో ఒక లీడర్‌ ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగును గుర్తించేందుకు వాటికి ఆడిషన్స్‌ నిర్వహించాం అంటే మేము ఈ సినిమా విషయంలో ఎంత పర్ఫెక్షన్‌ తో వర్క్‌ చేశామో అర్థం చేసుకోవచ్చు. చాలా కష్టపడి తీసిన ఈ చిత్రం తప్పకుండా మీ అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నాడు.