Begin typing your search above and press return to search.

రౌడీ గారి కుటుంబ క‌థా చిత్ర‌మ్‌

By:  Tupaki Desk   |   22 July 2020 9:30 AM IST
రౌడీ గారి కుటుంబ క‌థా చిత్ర‌మ్‌
X
రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ ఇస్పీడ్ గురించి తెలిసిందే. పాన్ ఇండియా సినిమా‌తో కెరీర్ బండి స్పీడ్ పెంచే ప‌నిలో ఉండ‌గా మ‌హ‌మ్మారీ మోకాల‌డ్డింది. కొన్ని నెల‌లుగా షూటింగులు నిలిచిపోవ‌డంతో ఇండ‌స్ట్రీకి ఎంతో ఇబ్బందిక‌రంగా మారింది. ఇక దేవ‌ర‌కొండ ఫైట‌ర్ చిత్రీక‌ర‌ణకు బ్రేకులు త‌ప్ప‌లేదు. ప్లాన్స్ అన్నీ ఫ్లాప్. ఇక కొత్త ప్లాన్ తో ముందుకు వెళ్లాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే ఈ క్వారంటైన్ టైమ్ ని దేవ‌ర‌కొండ ఇంట్లోనే కుటుంబ స‌భ్యుల‌తో స్పెండ్ చేస్తున్నాడు.

ఇటీవ‌లే దేవ‌ర‌కొండ‌ ఫిలింన‌గ‌ర్ ప‌రిస‌రాల్లో ఓ ఇంటిని కొనుక్కున్న సంగ‌తి తెలిసిందే. కొత్త ఇంట్లోకి గృహ‌ప్ర‌వేశం చేశారు. ఇక ఈ ఇంట్లో ఎంతో ఆనందంగా సాగిపోతోంది లైఫ్‌. సొంత‌ ఇంటి ఓన‌ర‌‌య్యాడు.. ఇక ఓ ఇంటివాడ‌య్యేదెపుడు పెళ్లెపుడు? అంటూ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌తిసారీ దానికి దేవ‌ర‌కొండ స‌రైన స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేస్తున్నాడు.

అన్ని ప్ర‌శ్న‌ల‌కు దేవ‌ర‌కొండ మ‌మ్మీ డాడీ చెక్ పెట్టేసే ఆలోచ‌న‌లోనే ఉన్నార‌ట‌. తాజాగా దేవ‌ర‌కొండ త‌న సోద‌రుడు ఆనంద్ .. మ‌ద‌ర్ మాధ‌వి దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ఉన్న ఫ్యామిలీ ఫోటో అంత‌ర్జాలంలోకి వ‌చ్చింది. ఆ కుటుంబంలోకి ఎవ‌రో కొత్త అతిథి ప్ర‌వేశించిందా? లేక చాలా కాలంగానే ఉన్న పెంపుడు పెట్ నా? అన్న‌ది దేవ‌ర‌కొండ‌నే చెప్పాలి. కుటుంబ అనుబంధాలు ఆప్యాయ‌త‌ల్ని ఆవిష్క‌రిస్తున్న ఈ ఫోటో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.