Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ప్రాణహాని: దర్శకుడి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   29 Feb 2020 12:30 PM IST
శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ప్రాణహాని: దర్శకుడి ఫిర్యాదు
X
రాకేష్ మాస్టర్.. ఈ సీనియర్ కొరియాగ్రాఫర్ వివాదాలతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని కృష్ణానగర్లో నివసించే ఈయన తెలంగాణ కళామతల్లి డ్యాన్స్ డైరెక్టర్ అండ్ డ్యాన్సర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలోనూ తన శిష్యుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన శేఖర్ మాస్టర్ తోనూ గొడవ పెట్టుకున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడా వ్యాఖ్యలతోనే శ్రీరెడ్డి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది.

తాజాగా మరోసారి విలేకరుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ విలేకరులతో మాట్లాడుతూ తాను 1500 సినిమాలకు కొరియాగ్రాఫర్ గా చేశానని.. ప్రస్తుతం ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని తెలిపాడు. గత నెల 29న శ్రీరెడ్డి తనను యూట్యూబ్, ఫేస్ బుక్ లో చంపుతానని బెదిరించిందని.. ఆమె మనుషులతో ఫోన్లు చేయిస్తూ బెదిరిస్తోందని ఆరోపించారు. ఈ ఆధారాల వీడియోలను పోలీసులకు అందజేశానని తెలిపారు.

ఇక తాను ఎన్టీఆర్ గురించి ఏమీ అనలేదని.. అనని మాటలను అపార్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తనను చంపేస్తామంటున్నారని.. బెదిరిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని దర్శకుడు రాకేష్ పోలీసులను కోరాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.