Begin typing your search above and press return to search.

ఆ లీడ‌ర్ ని `పొట్టోడా` అని అవ‌మానించి ఇరుక్కున్న కంగ‌న‌

By:  Tupaki Desk   |   19 Dec 2020 3:45 PM IST
ఆ లీడ‌ర్ ని `పొట్టోడా` అని అవ‌మానించి ఇరుక్కున్న కంగ‌న‌
X
క్వీన్ కంగన రనౌత్ ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయింది. ఇటీవ‌ల శివ‌సేన నాయ‌కుల‌పై వీరంగ‌మాడి విలువైన ఆస్తి న‌ష్ఠాన్ని చ‌విచూసింది. తాజాగా మ‌రోసారి తన ట్వీట్ వ‌ల్ల‌ మరోసారి చట్టపరమైన ఇబ్బందుల్లో పడింది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పి) చీఫ్ ఉపేంద్ర కుష్వాహపై `అవమానకరమైన` వ్యాఖ్యలు చేసినందుకు కంగ‌న‌పై గయా సివిల్ కోర్టులో ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నమైంది.

ఆర్.‌ఎల్.‌ఎస్.‌పి చీఫ్ ఉపేంద్ర కుష్వాహాపై అవమానకరమైన వ్యాఖ్య చేసినందుకు కంగనా రనౌత్ పై ఫిర్యాదు అందింది. ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆర్.‌ఎల్.‌ఎస్.‌పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినయ్ కుష్వాహా సివిల్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 3 న కంగనా రనౌత్ ట్విట్టర్ ద్వారా కుష్వాహా పొట్టితనాన్ని అవ‌హేళ‌న చేస్తూ స‌ద‌రు నాయకుడిపై అవమానకరమైన వ్యాఖ్య ను పోస్ట్ చేసారని ఇది ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నాడు. దీని కోసం కంగ‌న‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వినయ్ కుష్వాహా కోర్టును కోరారు. ఏ నాయకుడిపైనా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం నేరం అని న్యాయవాది శంభు ప్రసాద్ అన్నారు.

ఆర్.‌ఎల్.‌ఎస్.‌పి చీఫ్ ‌ను ఎగతాళి చేస్తూ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఫోటోపై డిసెంబర్ 3న క్వీన్ వ్యాఖ్యానించారు. అప్ప‌టికి కంగ‌న‌ ట్విట్టర్ పోస్టుల కోసం అనేక ఇతర ఫిర్యాదులు ఉన్నాయి. వ్యవసాయ బిల్లులపై ఆమె ఇటీవల నటుడు.. గాయకుడు దిల్జిత్ దోసంజ్ తో గొడ‌వ పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఇద్ద‌రి ట్విట్టర్ వార్ మంట‌లు పుట్టించింది. తాజా వివాదంతో మ‌రోసారి కంగ‌న పేరు మార్మోగుతోంది.