Begin typing your search above and press return to search.

90ఎంఎల్‌ : రాజకీయం కూడా మొదలైంది

By:  Tupaki Desk   |   5 March 2019 8:43 AM GMT
90ఎంఎల్‌ : రాజకీయం కూడా మొదలైంది
X
తమిళ బిగ్‌ బాస్‌ తో ఒక్కసారిగా స్టార్‌ డం దక్కించుకున్న ఓవియా నటించిన చిత్రం '90 ఎంఎల్‌'. పూర్తి అడల్ట్‌ చిత్రం అంటూ ఇప్పటికే ఈ చిత్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నలుగురి అమ్మాయిల జీవితాల్లో జరిగిన పరిణామాలను ఈ చిత్రంలో చూపించడం జరిగింది. అయితే అమ్మాయిలు మందు తాగడం - సిగరెట్స్‌ తాగడం - లెస్బియన్‌ గా చూపడం చేశారు. లిక్‌ లాక్‌ లు - బూతు డైలాగ్స్‌ ఇలా ఈ చిత్రం అంతా కూడా అడల్ట్‌ కంటెంట్‌ తో నిండి పోయింది. అందుకే ఈ చిత్రంను ప్రముఖులు ఏకేస్తున్నారు.

ప్రముఖ దర్శక నిర్మాత ధనుంజయన్‌ 90 ఎంఎల్‌ చిత్రంపై సంచలన వ్యాఖ్యలు చేయడం, వాటికి ఈ చిత్ర దర్శకురాలు అనిత ఉదీప్‌ గట్టి రిప్లై ఇవ్వడం వంటి పరిణామాలతో ఎక్కడ చూసినా కూడా సినిమా గురించి చర్చ జరుగుతోంది. ఈ సమయంలోనే ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. ఈ వివాదంలోకి ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌ పార్టీ కూడా ఎంటర్‌ అయ్యింది.

90 ఎంఎల్‌ చిత్రంపై సదరు పార్టీ వారు కేసు పెట్టారు. ఇలాంటి సినిమాల వల్లే రేప్‌ లు పెరుగుతున్నాయని, అలాగే కుర్రాళ్లు చెడిపోతున్నారు అంటూ విమర్శలు చేశారు. చెన్నై కమీషనర్‌ కు పార్టీ నాయకులు ఫిర్యాదును ఇవ్వడం జరిగింది. ఈ సినిమాను వెంటనే బ్యాన్‌ చేయడంతో పాటు - నటీనటులను మరియు దర్శక నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే సెన్సార్‌ బోర్డు క్లీయరెన్స్‌ ఇచ్చిన సినిమాలను పోలీసు వారు అడ్డుకునే అవకాశం లేదు. అందుకే పోలీసులు 90 ఎంఎల్‌ చిత్రాన్ని అడ్డుకోలేరు అంటూ తమిళ సినీ జనాలు అనుకుంటున్నారు. ఈ బూతు - రచ్చ - వివాదాస్పద చిత్రం తెలుగులో డబ్‌ కాబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ట్రైలర్‌ కూడా విడుదల అయ్యింది. తెలుగులో ఈ చిత్రం ఎంతటి వివాదాన్ని రాజేస్తుందో చూడాలి.