Begin typing your search above and press return to search.
బాబి-గోపీచంద్ మధ్య పోటాపోటీ!
By: Tupaki Desk | 8 Jun 2023 2:00 PMఒకప్పుడు కమర్శియల్ సినిమాల మేకర్స్ అంటే వి. వివినాయక్- బి.గోపాల్- శ్రీనువైట్ల లాంటి కొందరు సీనియర్ డైరెక్టర్ల పేర్లు ప్రముఖంగా కనిపించేవి. అప్పట్లో వాళ్లు తెరకెక్కించిన సినిమాలన్నీ పక్కా పైసా వసూళ్లు సినిమాలు. హీరో ఇమేజ్ తో సినిమాలు చేయడం వాళ్లకి మాత్రమే సాధ్యమైంది.
మాస్ కి కనెక్ట్ అయ్యే అంశాల తో సినిమాలు చేయడం వాళ్ల స్టైల్. అయితే కాల క్రమం లో ఆ ఒరవడి మారింది. ట్రెండ్ తో పాటు కాన్సెప్ట్ లు మారాయి. కొత్త తనం దర్శకులు కొత్త కాన్సెప్ట్ లకే పాత కమర్శియాల్టీని జొప్పించి సినిమాలు చేయడం మొదలైంది.
ప్రస్తుతం అలా ఫేమస్ అయిన దర్శకులు ఎవరు? అంటే బాబి..గోపీచంద్ మలినేని- త్రినాధరావు నక్కిన పేర్లు ప్రముఖంగా చెప్పొచ్చు. ముగ్గురు హీరో ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని కథలు రాసి తెరకెక్కిస్తుంటారు. పాత తరం కమర్శియల్ దర్శకుల తర్వాత నేటి తరం పక్కా కమర్శియల్ మేకర్స్ ఎవరు? అంటే వీళ్లే. వీళ్ల కథల్లో కొత్త దనం అంటూ ఏమీ ఉండదు. హీరో ఇమేజ్ ని ఆధారంగా తీసుకుని ట్రెండింగ్ కాన్సెప్ట్ తీసుకుని హిట్ కొట్టడం వీళ్ల స్టైల్. ఇందులో బాబి-గోపీచంద్ మధ్య మరింత సారూప్యత కనిపిస్తుంది.
దాదాపు ఇద్దరు సినిమాలు ఒకేలా ఉంటాయి. హీరోల తో భారీ ఫైట్లు.. ఓ ఐటమ్ సాంగ్.. కథ లో కమర్శియల్ అంశాలు.. సమపాళ్ల లో జొప్పిస్తుంటారు. ఆ రకంగా వీరిద్దరి మధ్య మంచి పోటీ వాతావరణం కనిపిస్తుంది. త్రినాధ రావు ఇంకా చిరంజీవి..బాలయ్య రేంజ్ హీరోల జోలి కి వెళ్లలేదు. టైర్ -2 హీరోల తోనే సినిమాలు చేస్తున్నారు. అవకాశం వస్తే త్రినాధరావు ఇదే ప్యాట్రన్ ఫాలో అవుతారు. అప్పుడా ఆ ఇద్దరి మధ్యలో కి ఈయన భాగమవుతాడు.
ప్రస్తుతానికి బాబి-గోపీచంద్ మధ్య ఈ రకమైన పోటీ తీవ్రంగా ఉంది. చిరంజీవి..బాలకృష్ణ లాంటి హీరోల కు ఇద్దరు మంచి కమర్శియల్ సక్సెస్ లు అందించారు. ఈనేపథ్యం లో నాగార్జున..వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలు వీళ్ల తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇద్దరు ఓ వైపు కొత్త ప్రయత్నాలు చేస్తున్నా! అలవాటైన ప్రాణాల కి మాస్ సినిమాలు పడక పోతే కష్టం కాబట్టి..మధ్య లో ఒక మాస్ కంటెంట్ తో అభిమానుల్ని మెప్పించాల్సిందే. ఆ రకంగా బాబి-గోపీచంద్ ఆ నలుగురికి మంచి ఆప్షన్ గా చెప్పొచ్చు.