Begin typing your search above and press return to search.

రాధేశ్యామ్‌ కి 'మురారి' తో పోలిక

By:  Tupaki Desk   |   12 March 2022 10:35 AM GMT
రాధేశ్యామ్‌ కి మురారి తో పోలిక
X
ప్రభాస్ హీరోగా తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్‌ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది. సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది అంటూ ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. వసూళ్లు చాలా పాజిటివ్ గా ముందు ముందు కూడా ఉంటాయనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సినిమాకు పబ్లిక్ టాక్ మరియు రివ్యూ లు విభిన్నంగా వచ్చాయి. ఎవరి అభిప్రాయం వారిది అన్నట్లుగా చాలా క్లియర్ గా డివైడ్ టాక్ కనిపించింది. ముఖ్యంగా క్లాస్ ప్రేక్షకులకు సినిమా మా పర్వాలేదు.. ఫీల్ గుడ్ మూవీ అనిపించింది. కానీ మాస్ ఆడియన్స్ లో కొంత మంది మాత్రం సినిమా పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్‌ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడంతో పాటు ప్రభాస్ ని ఆయన స్థాయికి తగ్గట్టుగా చూపించలేదు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సమయంలోనే సినీ విశ్లేషకులు కొందరు రాధేశ్యామ్‌ సినిమా మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం నటించిన మురారి సినిమా తో పోలుస్తారు. మహేష్ బాబు మురారి సినిమా లో మంచి యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమా కూడా అప్పట్లో డివైడ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా మురారి సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా.. మహేష్ బాబుకి మంచి పేరు తెచ్చి పెట్టడంతో పాటు ఆ తర్వాత తర్వాత పాటలకు మరియు సినిమా కు మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇప్పటికి కూడా టీవీలో మురారి సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఆసక్తిగా చూసే వారు చాలా మంది ఉన్నారు. మురారి సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులను కన్విన్స్ చేసే విధంగా లేదంటూ విమర్శలు వచ్చాయి. క్లైమాక్స్ తో పాటు కొన్ని సన్నివేశాలు మరీ స్లోగా సాగాయని.. కమర్షియల్‌ ఎలిమెంట్స్ కు దూరంగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు అదే తరహాలో రాధేశ్యామ్‌ సినిమా కి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయని.. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు అంటూ విమర్శలు వస్తున్నాయి. కానీ ఒక వర్గం ప్రేక్షకులు మురారి ని ఎలా అయితే ఆదరించారో అలాగే రాధేశ్యామ్‌ ని ఆదరిస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ముందు ముందు ప్రేక్షకులు సినిమా యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు అంటూ ప్రభాస్ అభిమానులు మరియు కొందరు ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.

కమర్షియల్గా మరీ దారుణమైన ఫలితాన్ని చవి చూడ పోవచ్చు.. కానీ భారీ బ్లాక్ బస్టర్ గా మాత్రం నిలిచే అవకాశం లేదు అప్పట్లో మురారి సినిమాకు ఎలాంటి ఫలితం అయితే దక్కిందో ఈ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ సినిమాకు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ను చూసే మూడ్‌ మరియు ప్రేక్షకుడిని బట్టి రాధేశ్యామ్‌ సినిమా ఫలితం ఉంది.