Begin typing your search above and press return to search.
ఆస్కార్ నటితో మీకు పోలికా.. కంగానను కౌంటర్
By: Tupaki Desk | 14 Feb 2021 8:00 AM ISTబాలీవుడ్ ఫైర్ బ్రాండ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై కంగనా తనదైన రీతిలో స్పందించి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడంలో ముందుంటారు.
వివాదాలకే కేరాఫ్ అయన కంగానా తాజాగా తనని తాను హాలీవుడ్ స్టార్ నటి మెర్లీ స్ట్రీప్, ప్రముఖ ఇజ్రాయిల్ నటి గాల్ గాడోట్ లతో పోల్చారు.. వారికంటే తానే ఎంతో మంచి నటిని అని.. కావాలంటే తన కంటే గొప్ప నటిని భూమ్మీద మరొకరిని చూపించగలరా అంటూ ట్విట్టర్ వేదికగా సవాలు చేసిన సంగతి తెలిసిందే.
దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రకరకాల మీమ్స్ తయారు చేసి ట్రోల్స్ చేశారు. 3 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మెరిల్ స్ట్రీప్ తో నీకు పోలికేంటి? అంటూ కంగనాను ఎద్దేవా చేశారు. 21 సార్లు ఆస్కార్ బరిలో నిలిచిన ఆమె ఎక్కడ? ఎన్ని ఆస్కార్ లు సాధించారంటూ కంగనా ను ట్రోల్ చేశారు నెటిజనులు.
ఈ విమర్శలపై కంగనా కౌంటర్ ఇచ్చారు. ‘ఆస్కార్ అనేది కేవలం అమెరికన్ సినిమాలకు మాత్రమే ఇచ్చే అవార్డు. ఆ లెక్కన చూసుకుంటే ఆమె ఎన్ని పద్మ, జాతీయ అవార్డులు పొందింది. బానిస మనస్తత్వం నుంచి బయటపడండి.. ఆత్మ గౌరవంతో మెలగండి అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తలోరకంగా విమర్శలు గుప్పిస్తూ హోరెత్తిస్తున్నారు.