Begin typing your search above and press return to search.

బాహుబలిలో కుల పోరాటం కూడా...

By:  Tupaki Desk   |   7 July 2015 12:14 PM IST
బాహుబలిలో కుల పోరాటం కూడా...
X
కులం ఇండియాలో ఆల్వేస్‌ హాట్‌ టాపిక్‌. కింది కులాలపై అగ్రకులాల పెత్తనం సాగుతోందంటూ ఎప్పట్నుంచో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. శతాబ్ధాల క్రితం, 200 సంవత్సరాల కంటే ముందు మన దేశాన్ని రాజులు పాలించారు. అప్పట్లో కులవృత్తులు ప్రత్యేకించి ఉండేవి. కొండకోనల్లో గిరిజనులు వేరుగా ఉండేవారు. అలాగే ఎక్కడ ఏ జాతి ఉన్నా అక్కడ వృత్తిని బట్టి కులాన్ని కేటగిరీల వారీగా డివైడ్‌ చేశారు. మడి, కట్టు, ఆచారం వగైరా వగైరా కులంతోనే పుట్టుకొచ్చాయి. మన ప్రాచీన సొసైటీ పునాదులు కులం మీదనే ఉన్నాయి. ఇకపోతే, బాహుబలిలో కులాన్ని ఒక రేంజులో టచ్‌ చేశారని అంటున్నారు.

అయితే ఇలా కులాల వారీగా డివైడ్‌ చేసి పాలించే ఓ రాజుగారితో ఓ గిరిజన యోధుడు ఎలాంటి పోరాటం నడిపించాడన్నదే బాహుబలి కథాంశం. వాస్తవానికి మన జానపదాల్లో లెక్క ప్రకారం రాజ్యం కోసం జరిగిన యుద్ధంలో ఓ చిన్న బిడ్డడిని నది దాటించి గిరిజన గ్రామాల్లో సురక్షితమైన చోట ఆ బిడ్డడిని పెంచడం సాంప్రదాయం. రామాయణం ప్రకారం లవకుశలు ఓ ఆశ్రమంలో పెరిగినట్టే, ఇక్కడ బాహుబలి కూడా గిరిజన తండాలో పెరుగుతాడు. అలా పెరగడం వల్ల గిరిజనుల్ని తక్కువ చేసి చూస్తే అతడు సహించలేదు. అయితే మహిష్మతి సామ్రాజ్యాన్ని పాలించే రాజుగారికి మాత్రం కింది కులాలంటే చిన్న చూపు. కాబట్టి ఆ రాజుగారికి, వీరుడైన బాహుబలికి మధ్య యుద్ధం షురూ అన్నమాట. అయితే కులాల్ని బాహుబలి మొదటి పార్ట్‌ కంటే రెండో పార్ట్‌లో ఎక్కువ టచ్‌ చేస్తారట.

అక్కడ అనూహ్యంగా బలహీన వర్గానికి చెందిన దేవసేన ఎంట్రీ ఉంటుంది. దేవసేన చెలరేగి పోరాడే వీరనారి కాబట్టి అక్కణ్ణుంచి కులం చిచ్చు మరింత రాజుకుంటుంది. పాలకుల్ని ఎదిరించి పోరాడే వీరనారిగా దేవసేన కనిపిస్తుంది. అమరేంద్ర బాహుబలి, దేవసేన లవ్‌ ఎపిసోడ్‌ అసాధారణంగా ఉంటుంది ఈ పార్ట్‌లో అంటున్నారు సన్నిహితులు. ప్రభాస్‌తో పాటు అనుష్క ఎక్కవగా కనిపించేది రెండో భాగంలోనే. ఇలా వార్‌ ఎపిక్‌ స్టోరీలో కులాల్ని టచ్‌ చేసిన గొప్పతనం రాజమౌళిదే. అతడు ఇంతకుముందు కూడా ఛత్రపతిలో బలహీన వర్గాల ఆకలి పోరాటాన్నే చూపించాడు. ఇప్పుడు అలాంటిదే మళ్ళీ ట్రై చేశాడనమాట.