Begin typing your search above and press return to search.

అమితాబ్ ను తొలగించండి.. కోర్టులో పిటిషన్!

By:  Tupaki Desk   |   8 Jan 2021 9:00 AM IST
అమితాబ్ ను తొలగించండి.. కోర్టులో పిటిషన్!
X
మనం ఎవరికైనా ఫోన్ చేయగానే.. ఓ కాలర్ ట్యూన్ వినిపిస్తుంది. కరోనాతో అప్రమత్తంగా ఉండాలంటూ ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది. కొవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సదరు వ్యక్తి సూచిస్తూ ఉంటారు. అయితే.. హిందీలో ఈ వాయిస్ ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అందించారు.

కాగా.. అమితాబ్ బచ్చన్ వాయిస్ ను తొలగించాలంటూ కోర్టు మెట్లెక్కాడో వ్యక్తి. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. కరోనా బారిన పడొద్దంటూ చెప్పే ఆ కొద్ది మాటలకు కూడా ఆయన డబ్బులు తీసుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నాడు. అలాంటప్పుడు ఆయన వాయిస్ ను తీసుకోవాల్సిన అవసరం లేదని కోర్టును కోరాడు.

అసలు అమితాబ్ కుటుంబమే కరోనా బారిన పడిందని, అలాంటి వాళ్లు.. ప్రజలకు ఏం జాగ్రత్తలు చెబుతారని ప్రశ్నించాడు. ఈ కాలర్ ట్యూన్ కోసం అమితాబ్ కు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్న పిటిషనర్.. కొవిడ్ నియంత్రణకు కృషి చేసిన ఎంతో మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉచితంగా తమ వాయిస్ ను అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. అలాంటి వారి వాయిస్ ను కాలర్ ట్యూన్ గా మార్చి, కరోనా జాగ్రత్తలు చెప్పిస్తే బాగుంటుందని కోరాడు. మరి, దీనిపై న్యాయస్థానం ఏం చెబుతుందో చూడాలి.