Begin typing your search above and press return to search.
హీరో నిఖిల్ ను సన్మానించిన కమీషనర్ సజ్జనార్
By: Tupaki Desk | 14 Aug 2021 9:16 AM ISTవరస విజయాలతో జోరు మీదున్న టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ను హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్ సన్మానించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో నిఖిల్ సేవలను గుర్తించిన సజ్జనార్ సముచితంగా గౌరవించారు. కరోనా సమయంలో తనవంతుగా కష్టంలో ఉన్న చాలా మందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు నిఖిల్. కోవిడ్ సమయంలో ఈ హీరో చేసిన సేవలను గుర్తించి సజ్జనార్ అతన్ని సన్మానించారు.
అలాగే నిఖిల్ లోని మానవతా దృక్పతాన్ని సజ్జనార్ మెచ్చుకున్నారు. కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేసిన నిఖిల్.. చాలా మందికి స్పూర్తిగా నిలిచారని తెలిపారు సజ్జనార్. సెకండ్ వేవ్ లో ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్న వాళ్లకు డబ్బు సాయం కూడా చేసారు నిఖిల్. అలాగే అవసరాలు తెలుసుకుని సాయపడ్డారు. మెడికల్ కిట్స్ తో పాటు కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ దగ్గరుండి చూసుకున్నారు నిఖిల్. ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి సాయపడ్డారు. కష్టకాలంలో సమస్య తన వరకూ చేరిందంటే సోనూ సూద్ లా నేనున్నాంటూ ముందుకొచ్చాడు. తన స్థాయికి తగ్గ సాయం చేశాడు. ఎలాంటి విరాళాలు సేకరించకుండా సొంత డబ్బు ఖర్చు చేసి బాధితులను ఆదుకున్నాడు. కొవిడ్ న్యూ వేరియెంట్ తో పాటు ఫంగస్ లాంటివి సోకినా వాటి చికిత్స లోను చొరవ చూపించాడు. నిఖిల్ మంచితనం..సేవాధృక్ఫథం గురించి అభిమానులు ఆసక్తికర పోస్ట్ లతో ప్రోత్సహించారు. ఈ నేపథ్యంలో నిఖిల్ కు సోషల్ మీడియాలో అనూహ్యంగా ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పుడు ఏకంగా నగర కమీషనర్ అతడిని సన్మానించడం ఆసక్తికరం.
ట్రాఫిక్ ప్రచారంలోనూ నిఖిల్ సాయం
ఇక హైదరాబాద్ ట్రాఫిక్ కంట్రోల్ విషయంలో నిఖిల్ ఇంతకుముందు పోలీస్ శాఖకు తనవంతు సాయం అందించిన సంగతి తెలిసిందే. సిటీ కమీషనర్ కార్యకలాపాలకు అతడు విధిగా ప్రచారం కల్పించారు. డిపార్ట్ మెంట్ తో నిఖిల్ కి చక్కని సత్సంబంధాలున్నాయి.
యంగ్ డైనమిక్ కి క్రేజీ ఆఫర్లు
మరోవైపు సక్సెస్ ఫుల్ హీరోగా అతడికి ఇప్పటికే పలు క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ-2.. 18 పేజీస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఒకటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కాగా.. మరొకటి జీఏ2 సంస్థలో క్రేజీ లవ్ ఎంటర్ టైనర్ గా అలరించనుంది.
ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడటంతో తాత్కలికంగా వీటికి బ్రేక్ పడింది. అయితే ఇవి గాక మరో మూడు సినిమాలకు లైన్ క్లియరైందని తెలుస్తోంది. వాటి వివరాలు ఇంకా రివీల్ కాలేదు గానీ దాదాపు లాక్ అయినట్లు సమాచారం. ఇటీవల కెరీర్ పరంగా చూస్తే.. నిఖిల్ కి ఫ్లాపులేవీ లేవు. ఇటీవల ఒకట్రెండు యావరేజ్ లు .. మిగతా వాటిలో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం చేతిలో రిలీజ్ కు రెడీగా ఉన్న ప్రాజెక్ట్ లు గనుక సక్సెస్ సాధిస్తే అతడు మరో మెట్టు ఎక్కినట్టే. వరుసగా క్రేజీ ఆఫర్లతో నిఖిల్ కి కెరీర్ పరంగా ఎలాంటి డోఖా లేదు.