Begin typing your search above and press return to search.

వకీల్‌ సాబ్‌ కు కమర్షియల్‌ హంగులా?

By:  Tupaki Desk   |   10 March 2020 12:20 PM GMT
వకీల్‌ సాబ్‌ కు కమర్షియల్‌ హంగులా?
X
బాలీవుడ్‌ ‘పింక్‌’ చిత్రం రీమేక్‌ తో పవన్‌ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే. అమితాబచ్చన్‌ కీలక పాత్రలో నటించిన పింక్‌ సినిమా ఒక సందేశాత్మక చిత్రం. ఆడవారి శక్తి గురించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇతరత్ర విషయాల గురించి మహిళలు ప్రధానంగా ఉండే కథాంశం తో పింక్‌ సినిమా తెరకెక్కింది. హిందీలో ఎలా అయితే ఉందో తమిళంలో ఉన్నది ఉన్నట్లుగా అజిత్‌ తో రీమేక్‌ చేశారు. కాని తెలుగుకు వచ్చేప్పటికి మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

పవన్‌ కళ్యాణ్‌ కమర్షియల్‌ హీరో అవ్వడం వల్ల.. సినిమాను కమర్షియల్‌ గా భారీ మొత్తానికి అమ్మాల నే ఉద్దేశ్యంతో సినిమాకు కమర్షియల్‌ హంగులు అద్దుతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ విడుదల సమయంలోనే టాక్‌ వచ్చింది. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న అనధికారిక సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ రోల్‌ కు పింక్‌ లో అమితాబ్‌ రోల్‌ కు చాలా తేడాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా పవన్‌ రోల్‌ లో కీలక మార్పులు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రంతో రాబోతున్నాడు కనుక ఫ్యాన్స్‌ చాలా ఆశిస్తున్నారు. వారిని నిరాశ పర్చవద్దనే ఉద్దేశ్యంతో పాత్ రలో మార్పులు చేర్పులు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మార్పులు సినిమాకు ప్లస్‌ అవుతుందా లేదంటే మైనస్‌ అవుతుందా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. సందేశాత్మక చిత్రానికి కమర్షియల్‌ హంగులు అద్దితే కష్టమే అంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే పవన్‌ ఏ సినిమా అయినా కూడా హిట్‌ అవ్వడం ఖాయం అంటూ నమ్మకంగా ఫ్యాన్స్‌ చెబుతున్నారు.