Begin typing your search above and press return to search.

అత‌డి వివాదాస్ప‌ద ట్రీట్ అవిక‌కు బ్రేకిస్తుందా?

By:  Tupaki Desk   |   2 Sep 2021 5:30 PM GMT
అత‌డి వివాదాస్ప‌ద ట్రీట్ అవిక‌కు బ్రేకిస్తుందా?
X
టాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌తో మ‌ళ్లీ బిజీ అవుతోంది న‌వ‌త‌రం బ్యూటీ అవికాగోర్. అవిక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాల‌న‌టిగానే అవార్డులు రివార్డులు అందుకున్న అవికా గోర్ ఆ త‌ర్వాత క‌థానాయిక‌గా నిరూపించుకుంది. ఆరంగేట్ర‌మే ఉయ్యాల జంపాల సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుని కెరీర్ జ‌ర్నీలో కొన్ని ఒడిదుడుకులు త‌ప్ప‌లేదు. అయితే ఇటీవ‌ల కొంత గ్యాప్ తీసుకుని తిరిగి టాలీవుడ్ లో ప్ర‌వేశిస్తున్న‌ ఈ బ్యూటీ వ‌రుస సినిమాలు వెబ్ సిరీస్ ల‌తో బిజీ అవుతోంది.

ఇక‌పోతే అవిక గోర్ న‌టించిన తాజా చిత్రం `నెట్` రిలీజ్ కి రెడీ అవుతుండ‌గా ప‌బ్లిసిటీ పీక్స్ కి చేరుకుంటోంది. `నెట్` లో రాహుల్ రామ‌కృష్ణ క‌థానాయ‌కుడు. ఇందులో ఈ జంట‌ భార్యాభ‌ర్త‌లుగా క‌నిపించ‌నున్నారు. ఫోర్న్ వీడియోల‌కు బానిసైన భ‌ర్త‌గా రాహుల్ కీల‌క‌ పాత్ర పోషిస్తున్నాడు. ఆ బానిస‌త్వంతో ఇంట్లో భార్య ఒంట‌రిగా ఉన్న‌ప్పుడు ఏం చేస్తుంది? అని ఇంట్లోనే సీక్రెట్ కెమారాలు అమ‌ర్చి చూస్తుంటాడు. ఇటీవ‌ల విడుద‌లైన సినిమా టీజ‌ర్.. ట్రైల‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో రాహుల్ కొన్ని బూతు కామెంట్లు చేయ‌డంతో అది సినిమా ప్ర‌చారానికి అవిక గోర్ ప్ర‌చారానికి క‌లిసొస్తోంది. ``ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి భ‌య‌ప‌డ‌ద‌ని.. సినిమా గు..లో ద‌మ్ముంద‌ని` రాహుల్ ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ ట్వీట్ పై నెటిజ‌నులు ర‌క‌ర‌కాలుగా కామెంట్లు చేసారు.

రాహుల్ మ‌ద్యం మ‌త్తులోనే అలా చేసాడ‌ని ర‌చ్చ‌వుతోంది. అదంతా అటుంచితే `నెట్` సినిమాకు మాత్రం మంచి ప్ర‌చారం ద‌క్కుతోంది. రాహుల్ బూతు సంభాష‌లు జోరుగా ట్రోల్ అవుతున్నాయి. అవికా గోర్ హాట్ ఫోటోల్ని షేర్ చేస్తూ సినిమాకు అవిక‌కు కూడా కావాల్సినంత ప్ర‌చారం చేసి పెడుతున్నారు నెటిజ‌నులు.

అవిక గోర్ కి ఈ సినిమా విజ‌యం సాధించ‌డం చాలా ముఖ్యం. అందుకే సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం కోరుకుంటోంది. దానికి అభిమానులు సాయం చేస్తున్నారు. వివాదంతో ప్ర‌చారం కొట్టేస్తున్న అవిక‌కు బ్రేక్ వ‌స్తుందా లేదా? అన్న‌ది చూడాలి.

ఇక అవిక గోర్ టాలీవుడ్ లో పెద్ద కెరీర్ ని ఆశిస్తున్న క్ర‌మంలో పెద్ద బ్యానర్లు ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. త‌దుప‌రి రైట‌ర్ కం ద‌ర్శ‌కుడు శ్రీ‌ధ‌ర్ సీపాన తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రంలో న‌టిస్తోంది. మెగా అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడు. GA2 పిక్చర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టి. జి. విశ్వ ప్రసాద్ -వివేక్ కుచిభోట్ల - అభిషేక్ అగర్వాల్ నిర్మాత‌లు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ‌ పురోగతిలో ఉంది. ఇటీవ‌ల అవికా గోర్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఫస్ట్ గ్లింప్స్ విడుద‌లై ఆక‌ట్టుకుంది. ఈ చిత్రానికి ఆండ్రూ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జునైద్ సిద్దిక్ ఎడిటర్.