Begin typing your search above and press return to search.

ఈజీగా స్టార్స్ అయిపోతున్నార‌న్న టాప్ హీరోయిన్

By:  Tupaki Desk   |   14 July 2022 9:30 AM GMT
ఈజీగా స్టార్స్ అయిపోతున్నార‌న్న టాప్ హీరోయిన్
X
అందాల కాజోల్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. 'మెరుపు క‌ల‌లు' సినిమాలో అర‌వింద స్వామి స‌ర‌స‌న న‌టించిన కాజోల్ .. అంత‌కుముందే సంచ‌ల‌న ప్రేమ‌క‌థా చిత్రం 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' (డిడిఎల్ జే)తో తెలుగు వారికి కూడా సుప‌రిచితం. క‌ళ్ల‌తోనే మాయ చేసే మ్యాజిక్ కాజోల్ సొంతం. న‌ట‌న‌తోనూ అంతే ఆక‌ట్టుకుంటుంది. స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌న్ ని పెళ్లాడిన ఈ బ్యూటీ వార‌సులు ఇప్పుడు న‌ట‌రంగంలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు.

ఇంత‌లోనే మూడు ద‌శాబ్ధాల కెరీర్ ని పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా కాజ‌ల్ ప్ర‌ముఖ హిందీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ముఖ్యంగా కాజ‌ల్ చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. OTT ల కారణంగా అపారంగా అవ‌కాశాలు పెరిగాయ‌న్న కాజోల్.. ఇప్పుడు స్టార అవ్వాలంటే 24 అంగుళాల నడుము 42 అంగుళాల ఛాతీ అవస‌రం లేదని అన్నారు. ఇవేవీ లేనప్పటికీ ప్రజలు స్టార్ లుగా మారుతున్నార‌ని అన్నారు. నటీనటులు తమ సత్తా ఏమిటో ప్రదర్శించడానికి OTT అనుమతించిందని కాజోల్ త‌న అభిప్రాయం వెలువ‌రించారు.

కాజోల్ మూడు ద‌శాబ్ధాల కెరీర్ లో హిందీ చిత్ర పరిశ్రమలో అతిపెద్ద తారలలో ఒకరు. త‌న అందం న‌ట‌న‌తో గొప్ప‌ జనాదరణ పొందారు. ప్రేక్షకులు అమితంగా త‌నను ఇష్ట‌ప‌డ్డారు. 1992 చిత్రం 'బెఖుడి'తో కాజోల్ తెరంగేట్రం చేసింది. ఇప్ప‌టికి షోబిజ్ లో 30 సంవత్సరాలు గడిపింది. గత మూడు దశాబ్దాలలో దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే - కుచ్ కుచ్ హోతా హై- మై నేమ్ ఈజ్ ఖాన్- గుప్త్- బాజీగర్ స‌హా ఎన్నో చిత్రాలలో కాజోల్ చిరస్మరణీయమైన నటనను ప్రదర్శించింది.

OTT రాకపై కాజోల్ 90వ దశకంలో థియేటర్ లు మాత్రమే వినోద మాధ్యమంగా క‌నిపించేవి.ఇది బాక్సాఫీస్ వద్ద విజయవంతమైన చిత్రాలకు గుర్తింపును చాలా సులభతరం చేసింది. ఇటీవ‌ల‌ OTT ఆగమనం అంతా మార్చేసింది. నటీనటులు తమ ప్రతిభను - సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇది పెద్ద‌ అవకాశం క‌ల్పించింద‌ని కాజోల్ అన్నారు.

కాజోల్ మాట్లాడుతూ- "వాస్తవానికి నేటిత‌రం నటీనటులందరికీ ఇది అద్భుతమైన సమయం. ఎందుకంటే వారు చాలా ఎక్స్ పోజర్ ను పొందుతున్నారు. ప్రతిఒక్కరికీ చాలా పని ఉంది. OTT కొంతమంది అద్భుతమైన నటులను బయటకు తీసుకువచ్చిందనే వాస్తవాన్ని నేను ప్రేమిస్తున్నాను. మీకు తెలుసా? 24 అంగుళాల నడుము - 36 అంగుళాల ఛాతీ లేకున్నా నిజంగా అద్భుతమైన నటులు తెర‌పైకొచ్చారు. తమ సత్తా ఏమిటో ఖచ్చితంగా చూపించగలిగే వ్యక్తులు .. స్వ‌యంగా స్టార్ లుగా మారే వ్యక్తులు ఉన్నారు. 46 అంగుళాల ఛాతీ అవ‌స‌రం లేదు.. అని వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుత కెరీర్ గురించి చూస్తే.. 'త్రిభంగా'లో తన్వి అజ్మీ- మిథిలా పాల్కర్ లతో కలిసి కనిపించింది. కాజోల్ ఇప్పుడు 'సలామ్ వెంకీ' కోసం రేవతితో కలిసి పని చేసింది. ఇందులో విశాల్ జెత్వా - అహానా కుమ్రా కూడా కీలక పాత్రల్లో నటించారు.