Begin typing your search above and press return to search.
థియేటర్లు తెరవగానే ఆ రెండు క్రేజీ సినిమాలు రెడీ
By: Tupaki Desk | 2 Oct 2020 10:15 AM ISTఅన్ లాక్ 5.0 ప్రక్రియకు ముందే నిశ్శబ్ధం.. ఒరేయ్ బుజ్జిగా సినిమాల్ని ఓటీటీల్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడు అన్ లాక్ 5.0 ను అమలు చేయడంలో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్లను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించనుంది. అన్ని సినిమా హాళ్లు కేవలం యాభై శాతం సామర్థ్యంతో స్క్రీనింగ్ చేయొచ్చని ప్రచారమైంది.
ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లు తెరిచిన వెంటనే రిలీజయ్యే తొలి క్రేజీ మూవీ ఏది? అంటే రామ్ నటించిన రెడ్ అంటూ ప్రచారమైంది. తాజా సమాచారం ప్రకారం.. మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ కూడా థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధమవుతోందిట. థియేటర్లు తెరిచిన వెంటనే రెడ్ .. క్రాక్ రూపంలో రెండు పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే సంబంధిత చిత్ర నిర్మాతలు పంపిణీ దారులతో థియేటర్లకు సంబంధించిన ఒప్పందాలను కూడా ప్రారంభించారని తెలుస్తోంది.
ఎనర్జిటిక్ హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ అందుకుని రెట్టించిన ఉత్సాహంతో `రెడ్` మూవీలో నటించాడు. ఇది థ్రిల్లర్ మోడ్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. రామ్ ద్విపాత్రాభియం చేస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. ఇక మాస్ మహారాజా రవి తేజ నటించిన క్రాక్ నిజ ఘటనలాధారంగా రూపొందిన రీమేక్ సినిమా. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు.