Begin typing your search above and press return to search.

ఇద్దరు కమెడియన్స్ హీరోలుగా 'బుజ్జి ఇలారా'

By:  Tupaki Desk   |   1 Aug 2021 6:34 AM GMT
ఇద్దరు కమెడియన్స్ హీరోలుగా బుజ్జి ఇలారా
X
కమెడియన్స్‌ హీరోలుగా సినిమాలు చేయడ టాలీవుడ్‌ లో చాలా సాదారణ విషయం. ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా గుర్తింపు దక్కించుకున్నారు. కమెడియన్ గా స్టార్ డం దక్కించుకుని ఆ తర్వాత హీరోగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన సునీల్‌ మళ్లీ ఈమద్య కమెడియన్ గా సినిమాలు చేస్తున్నాడు. ఒక వైపు కమెడియన్‌ గా సినిమాలు చేస్తూనే మరో వైపు హీరోగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇమేజ్ ను పక్కకు పెట్టి సునీల్‌ సినిమాలు చేస్తుండటంతో మంచి కంటెంట్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం సునీల్‌ మరో కమెడియన్‌ ధన్‌ రాజ్ తో కలిసి ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఆ సినిమాకు బుజ్జి ఇలారా అనే టైటిల్‌ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు.

హీరోగా ధన్‌ రాజ్‌ కొన్ని ప్రయత్నాలు చేశాడు. కాని అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కాని కమెడియన్‌ గా మాత్రం ధన్‌ రాజ్‌ కు మంచి స్కోప్ ఉంది. కమెడియన్స్ గా ధన్‌ రాజ్‌ మరియు సునీల్‌ లు ఎన్నో సినిమాలు కలిసి చేశారు. ఇప్పుడు హీరోలుగా కలిసి నటించబోతున్నారు. వీరు ప్రధాన పాత్రల్లో రూపొందబోతున్న బుజ్జి ఇలారా సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. `ఇట్స్ ఎ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్` అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా కు క‌థ‌, స్క్రీన్ ప్లే ను జి.నాగేశ్వ‌ర రెడ్డి అందిస్తున్నారు. ఇక సినిమాటోగ్ర‌పీ మరియు ద‌ర్శ‌క‌త్వం ను గ‌రుడ‌వేగ అంజి చేస్తున్నారు.

కామెడీ సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకున్న జి నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు కథ మరియు స్క్రీన్‌ ప్లే అందిస్తున్న నేపథ్యంలో తప్పకుండా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుతున్నారు. అతి త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించబోతున్నట్లుగా చెబుతున్నారు. కామెడీ తో పాటు అన్ని రకాల ఎలిమెంట్స్ ను ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మేకర్స్‌ నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించబోతున్నాడు.