Begin typing your search above and press return to search.

'ఏక్ మినీ కథ'లో చెలరేగిన కమెడియన్.. ఈసారి బిజీ అవుతాడా??

By:  Tupaki Desk   |   28 May 2021 4:00 PM IST
ఏక్ మినీ కథలో చెలరేగిన కమెడియన్.. ఈసారి బిజీ అవుతాడా??
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కామెడీ మూవీస్ అంటే ప్రత్యేకంగా కమెడియన్లను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రాసేవారు. కానీ ఇప్పుడు అలాంటి రోజులు పోయాయనే చెప్పాలి. ముందుగా సన్నివేశాలు రాసుకొని ఎవరు సూట్ అవుతారో వారిని సెలెక్ట్ చేసి అప్పుడు స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే.. ఈ మధ్యకాలంలో సినిమాలో కామెడీ పండించే హీరోలను చూసాం.. అలాగే కామెడీ కోసం సినిమా చేసే యాక్టర్లను చూస్తూనే ఉన్నాం. అయితే ఎవరు ఉన్నా లేకపోయినా హీరో హీరోయిన్స్ తోనే కామెడీ చేసేస్తున్నారు మేకర్స్. అయితే ఇండస్ట్రీలో హీరోలే కామెడీ చేసేస్తున్నారు అని కొందరు కమెడియన్స్ హీరోలుగా మారిపోతున్నారు. కానీ హీరోలుగా మారిన కమెడియన్స్ ఎక్కువకాలం హీరోలుగా కంటిన్యూ అవ్వట్లేదు.

అయితే టాలీవుడ్ లో టాలెంట్ కలిగిన అండర్ రేటెడ్ కమెడియన్ సుదర్శన్. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సుదర్శన్ ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే. అందులోను హిట్ అయ్యి పేరు తీసుకొచ్చేవి కొన్ని. కానీ సినిమాలు హిట్ అయినప్పటికీ క్యారెక్టర్స్ గుర్తింపు రాక మిగిలిన వారిలో సుదర్శన్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది కమెడియన్స్ గా తక్కువకాలంలో ఎస్టాబ్లిష్ అవుతున్నారు. కానీ ఇప్పటివరకు సుదర్శన్ కెరీర్ లో బ్రేక్ లభించలేదు. నెల్లూరు యాసలో సుదర్శన్ చేసే కామెడీ బేసిగ్గా అందరికి కనెక్ట్ అవుతుంది. తాజాగా అలాంటి క్యారెక్టర్ పడిందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. తాజాగా 'ఏక్ మినీ కథ' అనే కామెడీ మూవీ ఓటిటి రిలీజ్ అయింది.

బోల్డ్ పాయింట్ తో తెరకెక్కిన ఈ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ లో సంతోష్ శోభన్ - కావ్యతపర్ హీరోహీరోయిన్స్ గా నటించారు. అలాగే సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సుదర్శన్ కీలకరోల్ ప్లే చేసాడట. ముఖ్యంగా హీరో తర్వాత ఆ రేంజిలో క్లిక్ అయ్యే క్యారెక్టర్ చేసాడట సుదర్శన్. ఈ బోల్డ్ సినిమాలో సుదర్శన్ డైలాగ్స్ కి అడ్డులేకుండా పోయిందట. కానీ అన్నికూడా జనాలకు ఈజీగా కనెక్ట్ అవుతాయని సమాచారం. ఇప్పటివరకు చాలా సినిమాల్లో లిమిటెడ్ కామెడీ పండించిన సుదర్శన్.. చాలకాలం తర్వాత ఈ సినిమాతో కంబ్యాక్ అయ్యాడని అనుకోవడంలో సందేహం లేదంటున్నాయి సినీవర్గాలు. ప్రస్తుతం శోభన్ తో పాటు సుదర్శన్ కామెడీ లెవెల్స్ కూడా అదే రేంజిలో క్లిక్ అయ్యాయని చూసినవారు చెబుతున్నారట. చూడాలి మరి ఇకపై సుదర్శన్ బిజీ కమెడియన్ అవుతాడేమో!