Begin typing your search above and press return to search.
ఛాన్సుల్లేక నిర్మాతగా మారిన కమెడియన్
By: Tupaki Desk | 17 Dec 2020 8:46 AM ISTటాలీవుడ్లో సుదీర్ఘ కెరీర్ ఉన్న కమెడియన్లలో ఆలీ ఒకడు. బ్రహ్మానందం తర్వాత అంత లాంగెవిటీ ఆలీకే సాధ్యమైంది. మధ్యలో హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసిన ఆలీ.. దానికి ముందు, తర్వాత కామెడీ వేషాలే వేశాడు. ట్రెండు మారినా, కొత్త కొత్త కమెడియన్లు వస్తున్నా ఆలీ మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటూ మంచి డిమాండ్ మీదే సాగాడు. కానీ గత కొన్నేళ్లలో మాత్రం పరిస్థితి మారిపోయింది. బ్రహ్మానందం లాగే ఆలీకి సైతం అవకాశాలు తగ్గిపోయాయి. క్రమంగా కనుమరుగైపోయాడు. ఇప్పుడు ఆలీ ఏదైనా సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఆ మధ్య ఒక సినిమా వేడుకలో ఆలీకి అవకాశాలు తగ్గిపోవడంపై, అతడికి వ్యతిరేకంగా కొందరు కుట్రలు చేయడంపై పోసాని కృష్ణమురళి మాట్లాడటం చర్చనీయాంశమైంది.
ఆ సంగతలా వదిలేస్తే అవకాశాలు బాగా తగ్గిపోయిన ఈ తరుణంలో ఆలీ హీరోగా ఓ సినిమా మొదలుపెట్టడం విశేషం. ఆ సినిమా పేరు.. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆలీనే. ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అంటూ తన పేరు, ఇండస్ట్రీ పేరు కలిసొచ్చేలా తన బేనర్‌కు ఆసక్తికరమైన పేరు కూడా పెట్టుకున్నాడు ఆలీ. ఒకప్పుడు చెన్నైలో తన రూం మేట్ అయిన శ్రీపురం కిరణ్ అనే వ్యక్తిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు ఆలీ. మలయాళంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కి హిట్టయిన వికృతి అనే సినిమా ఈ చిత్రానికి ఆధారమట. నరేష్‌తో పాటు సీనియర్ నటుడు నరేష్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మౌర్యాని అనే కొత్తమ్మాయి కథానాయికగా నటించనుంది. మరి హీరోగా, నిర్మాతగా ఆలీ చేస్తున్న ఈ సాహసం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.