Begin typing your search above and press return to search.

కమెడియన్ పాప.. ఏం క్లారిటీ ఇచ్చిందిలే

By:  Tupaki Desk   |   22 Nov 2017 1:37 PM GMT
కమెడియన్ పాప.. ఏం క్లారిటీ ఇచ్చిందిలే
X
చెన్నై భామ అయినా తెలుగులో ఫుల్ స్వింగ్ లో ఉన్న కమెడియన్ విద్యుల్లేఖా రామన్. కాసింత బొద్దుగా ఉండి.. తన నటనతో తెగ నవ్వించేస్తున్న ఈ భామ.. రీసెంట్ గా బోలెడంత ధైర్యం చేసేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకూ ఏ కమెడియన్ ట్రై చేయని రీతిలో.. గ్లామర్ యాంగిల్ లో ఓ ఫోటో సెషన్ చేసి నెట్ లో పెట్టేసింది విద్యు. హీరోయిన్ గా మారేందుకు ప్రయత్నిస్తోందా అంటూ బోలెడన్ని కామెంట్స్ వచ్చి పడిపోతున్నాయి. ఒకట్రెండు రోజుల పాటు వీటన్నిటినీ జాగ్రత్తగా ఫాలో అయిన విద్యుల్లేఖ.. ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒకటే ఆన్సర్ ఇచ్చి పారేసింది. తనపై వస్తున్న మాటలకు.. కంటిన్యూగా క్లారిటీ ఇచ్చేసింది. 'మీ అందరికీ ఓ విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నా.. నేను ఇప్పుడు కమెడియన్ గా ఫుల్ బిజీగా ఉన్నాయి. అందుకే హీరోయిన్ పాత్రల గురించి ఆలోచించడం కూడా లేదు' అని చెప్పి.. పాయింట్స్ వైజ్ గా మరో రెండు ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా చెప్పింది.

'ఏ రంగులో ఉన్నా/ఏ షేప్ లో ఉన్నా మహిళలు తాము అందంగా ఉన్నామని భావించవచ్చు. అలాగే ఈ ఫోటోల్లో నాలో ఆత్మవిశ్వాసాన్ని చూసిన వందలాది మందికి అభినందనలు' అంటూ తన గ్లామర్ ఫోటోలపై బోలెడంత క్లారిటీ ఇచ్చింది కమెడియన్ విద్యుల్లేఖా రామన్.