Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ సినిమా పండగే అంటున్న కమెడియన్

By:  Tupaki Desk   |   28 April 2017 12:19 PM GMT
ఎన్టీఆర్ సినిమా పండగే అంటున్న కమెడియన్
X
వరుసగా మూడు హిట్లు కొట్టేసి ఊపుమీదున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అతడి తర్వాతి సినిమా ‘జై లవకుశ’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కాకపోతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత బాబీ తీస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో కొంత టెన్షన్ లేకపోలేదు. కానీ ఈ సినిమా విషయంలో కంగారేమీ అక్కర్లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు కమెడియన్ వేణు.

ఎన్టీఆర్ సినిమా గురించి ఇతను సర్టిఫికెట్ ఇవ్వడం ఏంటని అనిపించొచ్చు. ఐతే ‘జై లవకుశ’లో వేణు చెప్పుకోదగ్గ పాత్ర చేస్తున్నాడట. తన కెరీర్లో ఈ క్యారెక్టర్ మళ్లీ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్న వేణు.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సినిమా గురించి కూడా గొప్పగా చెప్పాడు. ‘జై లవకుశ’ మామూలుగా ఉండదని.. ఎన్టీఆర్ అభిమానులకు ఇది కనువిందే అని.. వాళ్లు పండగ చేసుకునేలా ఉంటందని అతనన్నాడు. పిచ్చాపాటిగా మాట్లాడుతూ అన్నా.. ఎలా అన్నా ఇలాంటి మాటలు అభిమానుల్లో ఎంత ఉత్సాహం తీసుకొస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రస్తుతం ‘జై లవకుశ’కు సంబంధించి 50 శాతం షూటింగ్ పూర్తయిందంటున్నారు. మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సినిమా సెప్టెంబరు 1న విడుదలయ్యే అవకాశముంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా.. నివేదా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/