Begin typing your search above and press return to search.

ఇండియాస్‌ టాప్‌ డైరెక్టర్‌ పై కమెడియన్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   5 Jun 2019 9:46 AM GMT
ఇండియాస్‌ టాప్‌ డైరెక్టర్‌ పై కమెడియన్‌ కామెంట్స్‌
X
దర్శకుడు శంకర్‌ కేవలం తమిళం, సౌత్‌ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా చాలా ఫేమస్‌. ఈయన చిత్రాలు బాలీవుడ్‌ లో కూడా భారీ అంచనాల నడుమ విడుదలయ్యే స్థాయికి శంకర్‌ చేరుకున్నాడు. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇండియాస్‌ బెస్ట్‌ డైరెక్టర్‌ గా గుర్తింపు దక్కించుకున్న శంకర్‌ పై కమెడియన్‌ వడివేలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చాలా ఏళ్ల క్రితం పోషించిన నేసమని పాత్ర ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యింది. ఆ కారణంగా మళ్లీ వార్తల్లోకి వచ్చిన వడివేలు తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శంకర్‌ పై సంచలన కామెంట్స్‌ చేశాడు. శంకర్‌ తో వడివేలుకు విభేదాలు అంటూ చాలా కాలంగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. హింసించే 23వ పులికేసి చిత్రంలో వడివేలు హీరోగా నటిస్తే.. శంకర్‌ ఆ సినిమాను నిర్మించాడు. అప్పటి నుండి వీరిద్దరి మద్య విభేదాలు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విభేదాలు ఎందుకు అనే విషయంలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి.

తాజాగా శంకర్‌ పై ఇంటర్వ్యూలో వడివేలు షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. శంకర్‌ కెరీర్‌ ఆరంభం నుండి కూడా గ్రాఫిక్స్‌ చేసుకుంటూ బతికేస్తున్నాడు. ఆయన కేవలం గ్రాఫిక్స్‌ కు మాత్రమే దర్శకుడు.. అంతకు మించి ఆయన వద్ద పెద్దగా ట్యాలెంట్‌ ఏమీ లేదని వడివేలు కామెంట్‌ చేశాడు. శంకర్‌ ను మరీ ఇంతగా విమర్శించడంతో వడివేలుపై తమిళ సినిమా పరిశ్రమకు చెందిన వారే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌ కు పేరు తీసుకు వచ్చిన దర్శకుడు శంకర్‌. అలాంటి దర్శకుడిపై పిచ్చి విమర్శలు ఏంటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా వడివేలు పెద్దగా సక్సెస్‌ లు లేక ఢీలా పడిపోయాడు. ఇలా శంకర్‌ పై విమర్శలు చేస్తే ఏమైనా మైలేజ్‌ వస్తుందేమో అని ఇలా చేస్తున్నాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.