Begin typing your search above and press return to search.

సత్య.. ది రైజింగ్ కమెడియన్

By:  Tupaki Desk   |   24 Sep 2016 1:30 PM GMT
సత్య.. ది రైజింగ్ కమెడియన్
X
కొందరు చూడగా చూడగా అలవాటవుతారు. వాళ్ల నటన నచ్చుతుంది. ఇంకొందరు చూడగానే నచ్చేస్తారు. ఈజీగా కనెక్టయిపోతాం. వాళ్ల టైమింగ్ అలా ఉంటుంది మరి. రైజింగ్ కమెడియన్ సత్య ఈ కోవలోకే వస్తాడు. ‘స్వామి రారా’ సినిమాలో హీరో ఫ్రెండుగా సత్య ఎలాంటి ముద్ర వేశాడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడి కామెడీ టైమింగ్ భలేగా ఉంటుంది. అతణ్ని చూడగానే నవ్వొస్తుంది. ఇక తనదైన టైమింగ్ తో డైలాగ్ చెబుతూ మరింతగా గిలిగింతలు పెడుతుంటాడు. ‘స్వామి రారా’ సినిమాలో జీవాతో నిఖిల్.. సత్య డీల్ మాట్లాడే సీన్లో అతడి నటన గురించి.. డైలాగ్ డెలివరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా పిల్ల జమీందార్.. దోచేయ్.. రౌడీఫెలో.. కార్తికేయ.. స్పీడున్నోడు లాంటి సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు సత్య.

యంగ్ హీరోల పక్కన ఫ్రెండు క్యారెక్టర్లకు ప్రస్తుతం సత్యను ఫస్ట్ ఛాయిస్ అవుతున్నాడు. ఇన్నాళ్లూ అతను కొంచెం చిన్న పాత్రలే చేశాడు కానీ.. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్స్ పడుతున్నాయి. గత నెలలో రిలీజైన సాయిధరమ్ తేజ్ మూవీ ‘తిక్క’లో ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు సత్య. హీరోతో సమానంగా అతడికి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది. సినిమా ఎలా ఆడినా సత్య కామెడీ మాత్రం సినిమాలో బాగానే వర్కవుటైంది. లేటెస్టుగా నాని మూవీ ‘మజ్ను’లో కీలక పాత్ర చేశాడు సత్య. ఇందులో కూడా అతడిది ఫుల్ లెంగ్త్ రోలే. సినిమా అంతా కూడా హీరో పక్కనే కనిపిస్తాడు. కథలోనూ అతడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అతడి నటన కూడా ఆకట్టుకుంది. సటిల్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు సత్య. ఆద్యంతం నవిస్తూ సాగిన సత్య.. కథను మలుపు తిప్పే సీరియస్ సన్నివేశంలోనూ మెప్పించాడు. ఈ పాత్ర సత్య కెరీర్ కు మలుపు కావచ్చు. మున్ముందు సత్యను మరిన్ని కీలక పాత్రలు వరించే అవకాశముంది. కాబట్టి ఈ టాలెంటెడ్ కమెడియన్ నుంచి మరిన్ని నవ్వులు ఆశించవచ్చు.