Begin typing your search above and press return to search.

ఆ కమెడియన్ సీన్స్ కట్ చేశారా?

By:  Tupaki Desk   |   2 April 2018 5:53 AM GMT
ఆ కమెడియన్ సీన్స్ కట్ చేశారా?
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలుస్తోన్న రంగస్థలం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అజ్ఞాతవాసి సినిమాతో నిరాశలో ఉన్న మెగా ఫ్యాన్స్ కి రంగస్థలం ఫుల్ కిక్ ఇచ్చింది. సినీ తారలు కూడా సినిమా చాలా బావుందని ప్రశంసలను అందిస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా రన్ టైమ్ పై మొదట కొన్ని అనుమానాలను చెలరేగిన సంగతి తెలిసిందే. నిడివి సమయం అంత ఎక్కువగా ఉంటే కష్టమనే టాక్ ముందే వచ్చింది.

అయితే మెగాస్టార్ కోసమని స్పెషల్ షో వేసిన కారణంగా చిత్ర యూనిట్ రన్ టైమ్ దగ్గరికి వెళ్లలేదు. దర్శకుడు సుకుమార్ అంతకుముందే సినిమా నిడివి సమయాన్ని తగ్గించాలని అనుకున్నాడు. కానీ మెగాస్టార్ ఒక్క సిన్ కూడా కట్ చేయవద్దని చెప్పడంతో రెండు గంటల 50 నిమిషాల సినిమా విడుదలైంది. యాడ్స్ తో కలిపి మూడు గంటలు అయ్యింది. అయితే సుకుమార్ అంతకుముందే కొన్ని సీన్స్ కట్ చేశారని తెలుస్తోంది.

ముఖ్యంగా కమెడియన్ పృథ్వీతో చేసిన ఎపిసోడ్స్ ని కట్ చేసినట్లు సమాచారం. సుకుమార్ కొన్ని సీన్స్ లలో పృథ్వీ కామెడీ ట్రాక్ ను చాలా బాగా ప్లాన్ చేసుకున్నప్పటికీ సినిమా నిడివి తగ్గించేందుకు వాటిని కట్ చేయడం కంటే బెటర్ ఆప్షన్ దొరకలేదట. దీంతో 10 నిమిషాల వరకు సీన్స్ ఎడిటింగ్ లో పోయినట్లు సమాచారం. అయితే ఇప్పుడు చూడకపోయినా డిజిటల్ వరల్డ్ లోకి సినిమా వచ్చినప్పుడు చూడవచ్చు.