Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ వ‌ల్ల ఎవ‌డికి ఉప‌యోగం:పృధ్వీ!

By:  Tupaki Desk   |   4 Aug 2018 11:39 AM GMT
బిగ్ బాస్ వ‌ల్ల ఎవ‌డికి ఉప‌యోగం:పృధ్వీ!
X
ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ క‌మెడియ‌న్ ల‌లో పృధ్వీ ఒక‌రు. చిన్న చిన్న పాత్ర‌ల నుంచి స్టార్ క‌మెడియ‌న్ గా పృధ్వి అంచెలంచెలుగా ఎదిగారు. త‌న కామెడీ టైమింగ్ తో ....పంచ్ డైలాగుల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తున్నారు పృధ్వి. `థ‌ర్టీ ఈయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ‌` అన్న ఒకే ఒక్క డైలాగ్ తో పాపుల‌ర్ అయిను పృధ్వీ....ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నారు. ఇటు క‌మెడియ‌న్ గా చేస్తూనే....హీరోగా రాణిస్తున్నారు. పృధ్వీ హీరోగా న‌టిస్తోన్న రెండో సినిమా`మై డియ‌ర్ మార్తాండం`త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇండ‌స్ట్రీలో ఉన్న‌ది ఉన్న‌ట్లు కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడే అతి కొద్ది మందిలో పృధ్వీ ఒక‌రు. తాజాగా, ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పృధ్వీ ...బిగ్ బాస్ షో గురించి అనేక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గ‌తంలో గ్రామాల్లో పెళ్లిళ్లు జ‌రిగేట‌పుడు....పెళ్లికి వ‌చ్చిన వారంతా....ఒక చోట చేర‌తార‌ని...అలాంటిదే బిగ్ బాస్ అని పృధ్వీ అన్నారు. అస‌లు బిగ్ బాస్ వ‌ల్ల ఎవ‌రికి ఉప‌యోగం లేద‌ని....జ‌నాళ్ల‌ను పిచ్చోళ్ల‌ను చేస్తున్నార‌ని అన్నారు. ఆడొచ్చి దీన్ని గిల్ల‌డం...ఈడొచ్చి దాన్ని క‌దిలిచ్చ‌డం........ప‌నీ పాటా లేని ఈ షో వ‌ల్ల ఎవ‌డికి ఉప‌యోగం లేద‌ని - డ‌బ్బులు తీసుకొని ఇవా చూపించేద‌ని పృధ్వీ అన్నారు.ఒక‌వేళ తాను బిగ్ బాస్ లో కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళితే... త‌న‌కు నిద్ద‌ర‌లో లేచే అలవాటుంద‌ని ....లేడీస్ ప‌క్క‌న ప‌డుకుంటే....గోల అవుతుంద‌ని సెటైర్ వేశారు. బిగ్ బాస్ లో కెళ్లి అక్క‌డున్న వారిని క‌డిగేస్తాన‌ని అన్నారు. బిగ్ బాస్ లో క‌రెక్ట్ మ‌జా రావాలంటే..త‌న‌తోపాటు పోసాని - కే ఏ పాల్ ల‌ను వైల్డ్ కార్డ్ ఎంట్రీల‌తో లోప‌లికి పంపాల‌ని చ‌మ‌త్క‌రించారు. తాను సాయంత్రం 6 గంట‌ల‌కు ధ్యానం చేస్తాన‌ని...ఆ త‌ర్వాత రెస్ట్ తీసుకుంటాన‌ని......అర్ధ‌రాత్రి వ‌ర‌కు ట్యాంక్ బండ్ మీద తిరిగే బ్యాచ్ కాద‌ని సెటైర్ వేశారు.