Begin typing your search above and press return to search.

స్టార్ కమెడియన్ కి యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   5 Sep 2016 7:30 AM GMT
స్టార్ కమెడియన్ కి యాక్సిడెంట్
X
బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్రతో తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కమెడియన్ అయిపోయాడు పృథ్వీ. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే ఒక్క డైలాగ్ తో ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయిన ఈ కమెడియన్.. ప్రస్తుతం కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో పృథ్వీ యాక్ట్ చేయని సినిమాలు అరుదుగా వస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

స్టార్ కమెడియన్ పృథ్వీ.. తాజాగా ప్రమాదానికి గురయ్యాడు. సాయిధరం తేజ్-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీలో పృథ్వీకి చాలా ఇంపార్టెంట్ కేరక్టర్ ఉంది. కాసిన్ని రిస్కీ షాట్స్ కూడా చేయాల్సి ఉంటుంది. ఓ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ లో భాగంగా.. ఓ రోప్ షాట్ ను చిత్రీకరిస్తుండగా.. ప్రమాదం జరిగింది. రోప్ నుంచి జారిపోవడంతో పృథ్వీ స్వలంగా గాయపడ్డాడు.

ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్.. పృథ్వీని ఆస్పత్రికి తరలించగా.. పెద్దగా ప్రమాదం ఏం లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తను కోలుకుంటున్నానని.. చిన్న గాయాలు తప్ప ఏం జరగలేదని పృథ్వీ అంటున్నాడు. తన ఆరోగ్యం కోసం ప్రార్దించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు ఈ స్టార్ కమెడియన్.