Begin typing your search above and press return to search.

నా న‌ట‌న చూశారు.. ద‌ర్శ‌కుడిగా టాలెంట్ చూపిస్తాః క‌మెడియ‌న్‌

By:  Tupaki Desk   |   14 March 2021 9:32 AM GMT
నా న‌ట‌న చూశారు.. ద‌ర్శ‌కుడిగా టాలెంట్ చూపిస్తాః క‌మెడియ‌న్‌
X
సినిమా నిర్మాణంలోని 24 విభాగాల్లో ఏదో ఒక విభాగం ద్వారా ఇండ‌స్ట్రీలోకి ప్ర‌వేశించి.. ఆ త‌ర్వాత అన్నింటికన్నా ప్ర‌ధాన‌మైన ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్‌’గా మారిపోయిన వారు చాలామందే ఉన్నారు. ర‌చ‌యిత‌లుగా మొద‌లై.. ద‌ర్శ‌కులు సూప‌ర్ హిట్ అయిన‌వారు ఇప్పుడు క‌ళ్ల‌ముందే ఉన్నారు. వారి జాబితాలో తాను కూడా చేరతానంటున్నాడు యువ క‌మెడియ‌న్ ప్రియ‌ద‌ర్శి.

పెళ్లి చూపులు సినిమాలో త‌న‌దైన టైమింగ్ తో అద్భుత‌మైన కామెడీని పండించిన ద‌ర్శి.. ఇక ఆ త‌ర్వాత వెనుదిరిగి చూడాల్సిన అవ‌స‌రం రాలేదు. చేసిన ప్ర‌తీ సినిమా త‌గిన గుర్తింపు తీసుకురావ‌డంతో స్టార్ క‌మెడియ‌న్ గా మారిపోయాడు. అయితే.. ఇప్పుడు త‌న‌లోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టాడు. మెగాఫోన్ ప‌ట్టాల‌ని ఎంతో కోరిక‌గా ఉందంటున్న ప్రియ‌ద‌ర్శి.. ఇందుకోసం క‌థ‌ను కూడా సిద్ధం చేసుకుంటున్న‌ట్టు తెలిపాడు.

ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా చెప్పాడు.. తాను మెగాఫోన్ కు శాశ్వ‌తంగా అంకితం అయిపోన‌ని, అవ‌కాశం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే కెప్టెన్ గా మారిపోతాన‌ని అంటున్నాడు. త‌న ప్ర‌ధాన దృష్టి యాక్టింగ్ మీద‌నే అంటున్నాడీ యంగ్ క‌మెడియ‌న్‌. టాలెంట్ చూపించాలేగానీ.. తెలుగు ప్రేక్ష‌కులు ఎవ్వ‌రినైనా ఆద‌రిస్తార‌న్న‌ది వాస్త‌వం. సో.. ప్రియ‌ద‌ర్శి కూడా అద్భుత‌మైన సినిమా తీసి, డైరెక్ట‌ర్ గానూ స‌క్సెస్ కావాల‌ని ఆశిద్దాం.