Begin typing your search above and press return to search.

షాక్‌.. కరోనాతో మరో నటుడు మృతి

By:  Tupaki Desk   |   31 March 2020 12:00 PM IST
షాక్‌.. కరోనాతో మరో నటుడు మృతి
X
కరోనా కరాళనృత్యం కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య భయానకంగా పెరిగి పోతుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో లాక్‌ డౌన్‌ అములో ఉన్నా కూడా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకు వేలల్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలోనే పలువురు హాలీవుడ్‌ స్టార్స్‌ కూడా కరోనాతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా మరో హాలీవుడ్‌ నటుడు కూడా కరోనా కారణంగా మృతి చెందాడు.

జపాన్‌ కమెడియన్‌ కెన్‌ షిముర కూడా కరోనా పాజిటివ్‌ తో మృతి చెందాడు. 70 ఏళ్ల కెన్‌ గత రెండు వారాలుగా కరోనాతో బాధపడుతున్నాడు. ఆయనకు ప్రముఖ వైధ్యులు చికిత్స అందించినా కూడా లాభం లేకుండా పోయింది. ఆయన వృద్యాప్యం తో పాటు అంతకు ముందే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న కారణంగా కరోనా కభలించి వేసినట్లుగా వైధ్యులు ప్రకటించారట.

కెన్‌ మరణం పై హాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంకా ఎంత మందిని కరోనా బలి తీసుకుంటుందో అనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతుంది. కరోనా నేపథ్యంలో హాలీవుడ్‌ నుండి టాలీవుడ్‌ వరకు అన్ని భాషల సినిమాల షూటింగ్స్‌ పూర్తిగా నిలిచి పోయాయి. సినిమా పరిశ్రమ ఎక్కడికక్కడ స్థంభించి పోయిన విషయం తెల్సిందే.