Begin typing your search above and press return to search.
అటువైపు ఇంకో రాయి వేస్తున్న ఆలీ
By: Tupaki Desk | 11 Aug 2016 10:26 AM ISTసినిమా అంతా హీరో పక్కనే వుంటాడు, అలాగని ఏకకాలంలో మూడు నాలుగు పెద్ద సినిమాలలో కనిపిస్తాడు, ఆలీ డేట్స్ ఎలా మేనేజ్ చేస్తాడో ఎవరికీ అర్థంకాదని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఒకసారి సభాముఖంగా తెలిపారు. దాదాపు అందరి పెద్ద హీరోల సినిమాల్లో తప్పక కనిపించే పాత్ర ఆలీది.
అయితే కమెడియన్ గా సక్సెస్ అవుతున్నా గతంలో కొన్నిసార్లు హీరోగా సైతం నటించి విజయం సాధించిన సందర్భాలు వున్నాయి గనుక హీరో వేషాలపై మోజు తీరట్లేదు. మంచి కధలకోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అలాంటి కథతోనే జర్నలిస్ట్ నుండి డైరెక్టర్ గా మారిన నాగు గవర ఆలీని కలిసినట్టు, అతను పచ్చజెండా వూపినట్టు సమాచారం.
ఈ ప్రాజెక్టు కి సంజయ్ రామసామి అన్నది టైటిల్ అయితే, గతం గెలుక్కున్న గజినీ అన్నది ట్యాగ్ లైన్. పేర్లు ఆకట్టుకోవడంతో మీడియా దృష్టి ప్రాజెక్టు మీద పడింది. ఆలీ ఫుల్ టైం హీరోగా 2013 ఆలీ బాబా ఒకడే దొంగ సినిమాలో నటించాడు