Begin typing your search above and press return to search.

ఘ‌నంగా ఆ హాస్య న‌టుడి కుమార్తె నిశ్చితార్థం!

By:  Tupaki Desk   |   27 Aug 2022 9:17 AM GMT
ఘ‌నంగా ఆ హాస్య న‌టుడి కుమార్తె నిశ్చితార్థం!
X
కమెడియన్‌ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు సినిమాలు, ఇంకోవైపు రాజ‌కీయాలు, మ‌రోవైపు టీవీ షోలు... ఇలా మూడు ప‌డ‌వ‌ల మీద ప్ర‌యాణిస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించారు. ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. ఆయ‌న‌కు ఇటీవ‌ల పెద్ద ప‌ద‌వి కూడా వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవేమీ నిజం కాలేదు. ప్ర‌స్తుతం అలీ సినిమాల కంటే టీవీ షోల‌తో బిజీగా ఉన్నారు.

మ‌రోవైపు అలీ భార్య జుబేదా కూడా యూట్యూబ్ చానెల్ ను నిర్వ‌హిస్తోంది. ఆమెకు లక్ష‌ల సంఖ్య‌లో స‌బ్‌స్రైబ‌ర్లు ఉన్నారు. అలీకి దీటుగా యూట్యూబ్ ద్వారా జుబేదా కూడా త‌న‌కంటూ అభిమానుల‌ను ఏర్ప‌ర‌చుకున్నారు.

కాగా అలీకి ముగ్గురు సంతానం కాగా.. పెద్దకూతురు ఫాతిమా ఇటీవలే వైద్య విద్య‌ను పూర్తి చేసింది. ఈ నేప‌థ్యంలో ఆమెకు ఎంగేజ్‌మెంట్ నిర్వ‌హించారు. త్వ‌ర‌లోనే పెళ్లి జ‌ర‌గ‌నుంది. ముస్లిం సంప్రదాయం ప్రకారం అలీ కూతురు ఎంగేజ్ మెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

ఫాతిమాకు కాబోయే వరుడు డాక్టర్ అని తెలుస్తుంది. అంతేకాదు..అలీ వియ్యంకుల‌ వారింటా అందరూ డాక్టర్లేనని అలీ భార్య‌ జుబేదా తన వీడియోలో అందరినీ పరిచయం చేశారు.

ఈ వీడియోను అలీ భార్య జుబేదా త‌న యూట్యూబ్ చానెల్ లో పోస్టు చేయ‌డంతో వైర‌ల్ గా మారింది.ఈ వేడుకకు అలీ-జుబేదా దంప‌తుల బంధుమిత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యార‌ని తెలుస్తోంది.

ఈ వేడుక‌కు సినీన‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ దంప‌తులు, ప్ర‌ముఖ హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. పెళ్లి కుమార్తె, కుమారుడిని ఆశీర్వదించారు. కాగా ఈ వీడియోను పోస్టు చేసిన ఐదు గంట‌ల్లోనే యూట్యూబులో ప‌ది ల‌క్షల మంది వీక్షించారు.