Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ ముగిశాక అమెరికాలో తొలి రిలీజ్
By: Tupaki Desk | 14 May 2020 10:00 AM ISTబాహుబలి ముందు బాహుబలి తర్వాత టాలీవుడ్ మార్కెట్ ని చూస్తే అమెరికాలో మన సినిమా పెద్ద రేంజుకు ఎదిగింది. ఒక రకంగా చూస్తే అమెరికా మరో నైజాంగా మారిందన్న ఆనందం కనిపించింది. అక్కడ 3.5 మిలియన్ డాలర్ వసూళ్లను సాధించే స్థాయికి మన అగ్ర హీరోలు ఎదిగారు. అయితే ఇప్పుడు కరోనా ముందు కరోనా తర్వాత అని డివైడ్ చేయాల్సి వస్తోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత అమెరికాలో తెలుగు సినిమా పరిస్థితేమిటి? అంటే రకరకాలు సందేహాలు ఊపిరాడనివ్వడం లేదు.
మొన్ననే అమెరికాలో అతి పెద్దదైన ఏఎంసీ థియేటర్ చైన్ వ్యవస్థను షట్ డౌన్ చేస్తున్నారని .. థియేటర్ల మెయింటెనెన్స్ చేయలేక.. క్రైసిస్ ని తట్టుకోలేక అమెజాన్ కి అమ్మేస్తున్నారని వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాల్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేసే వ్యవస్థను క్రైసిస్ పుణ్యమా అని ఆదిలోనే లేపేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే ఇన్ని సందేహాల నడుమ ఇప్పుడు తెలుగు సినిమాకి ఊపిరి పోసేందుకు మన నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు గుండె నిబ్బరాన్ని పెంచేందుకు ఒక హాలీవుడ్ సినిమా అక్కడ రిలీజ్ కి వస్తోంది. అదే .. గ్లాడియేటర్ ఫేం రస్సెల్ క్రో నటించిన క్రేజీ థ్రిల్లర్ చిత్రం `అనిహింగెడ్`. అమెరికన్ థియేటర్లను తిరిగి తెరిచాక రిలీజవుతున్న తొలి చిత్రమిది. నిజానికి ఈ మూవీని సెప్టెంబర్ 4 న విడుదల చేయాల్సి ఉండగా.. జూలై 1 వ తేదీకే వచ్చేయాలని మేకర్స్ నిర్ణయించారు. యునైటెడ్ స్టేట్స్ లో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ ని పక్కన పెట్టేసి యాక్టివిటీస్ ప్రారంభించాయి. అన్ని రాష్ట్రాలు జూలై 1 నాటికి తిరిగి యథాస్థితికి చేరుకుంటాయని ట్రంప్ చెబుతున్నారు. `నేషనల్ అసోసియేషన్ ఆఫ్ థియేటర్స్` వాళ్లు ప్రముఖ థియేటర్ చైన్ వ్యవస్థతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట.
అమెరికాలో ఏం జరిగినా తొలిగా ఉలిక్కి పడేది భారతదేశమే. ప్రస్తుతం అక్కడ సినిమాల రిలీజ్ ల సంగతుల్ని టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. అమెరికా మార్కెట్ ని పోగొట్టుకునేందుకు మన వినోద పరిశ్రమలు సిద్ధంగా లేవు. అందుకైనా అక్కడ కరోనా తగ్గాలని ప్రార్థనలు చేస్తున్నారు. రాబోయే `అనిహింగెడ్` రిజల్ట్ ఎలా ఉంటుంది? అన్నది చాలా కీలకం కాబోతోంది. ఆ సినిమా బాగా ఆడాలంటే జనం ఇండ్ల నుంచి బయటికి రావాలి. థియేటర్లకు ఆదరణ పెరగాలి. అప్పుడే కలెక్షన్స్ వచ్చి హుషారు పెరుగుతుంది. ఈ సినిమా తర్వాత కూడా పలు క్రేజీ హాలీవుడ్ చిత్రాలు క్యూలో ఉన్నాయి. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన `టెనెట్` .. డిస్నీ `ములన్` కూడా జూలైలోనే రిలీజ్ కానున్నాయి. వీటి రిలీజ్ తేదీల్ని ప్రకటించాల్సి ఉంది.
అయితే ఈ మూడు సినిమాల రిలీజ్ లను పరిశీలించాక ఒక అవగాహనకు రావొచ్చు. అంతా సవ్యంగా ఉందనుకుంటే మన సినిమాల్ని కూడా అమెరికాలో యథాతథంగా రిలీజ్ చేసుకునే వీలుంటుంది. అప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటర్లలోనూ ఉత్సాహం పెరుగుతుందనేది ఒక రకమైన ఆశావహ ధృక్ఫథం. కరోనా అనేది ఒక వ్యాధి మాత్రమే. దానిని ఎదుర్కొనే ధైర్యం సత్తా భారతీయుల్లో ఉందని ఇప్పటికే ప్రూవ్ అవుతోంది. అమెరికాలో అమెరికన్లు అతలాకుతలం అయినా కానీ మన భారతీయులు కరోనాని ఎదుర్కొని నిబ్బరంగానే ఉన్నారన్నది ఆశావహ ధృక్పథాన్ని పెంచుతోంది. ఇది సినిమా పురోభివృద్ధికి కలిసి రావాలని ఆకాంక్షిద్దాం.