Begin typing your search above and press return to search.

కోలంబ‌స్‌.. ఇంకా సెన్సార్ అవ్వలేదు

By:  Tupaki Desk   |   19 Oct 2015 9:30 AM GMT
కోలంబ‌స్‌.. ఇంకా సెన్సార్ అవ్వలేదు
X
ఇంకా మూడు రోజులే .. ద‌స‌రా ఫ‌ర్వ‌దినానికి మిగిలి ఉన్న‌ది. ఈనెల 22న రిలీజ్‌ కి వ‌చ్చేస్తున్నాం అని ప్ర‌క‌టించాడు సుమంత్ అశ్విన్‌. అత‌డు న‌టించిన తాజా చిత్రం కోలంబ‌స్ ఈనెల 22న రిలీజ‌వుతోంది. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని ద‌స‌రా బ‌రిలో రిలీజ్ చేయ‌కూడ‌ద‌ని భావించిన సుమంత్ అశ్విన్ బృందం అఖిల్ వాయిదా తర్వాత ప్లాన్ మార్చుకుంది. ఇదే స‌రైన టైమ్ .. ఈ ద‌స‌రా సెల‌వుల్ని క్యాష్ చేసుకుంటేనే మంచిద‌ని భావించి అన్ని ప‌నులు పూర్తి చేసుకుని రిలీజ్‌ కి వ‌చ్చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

ఈ విష‌యంలో ఎం.ఎస్‌.రాజు తెలివైన ప్లానింగే చేశారు. కోలంబ‌స్ ఓ చ‌క్క‌ని ల‌వ్‌ స్టోరీ. ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌తో సుమంత్ అశ్విన్ రొమాన్స్ చేస్తున్నాడు. ఆర్‌.సామ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి - సీర‌త్‌ క‌పూర్ వంటి అందాల భామ‌ల గ్లామ‌ర్ ఈ సినిమాకి పెద్ద అస్సెట్ కానుంది. సుమంత్ అశ్విన్‌ కి స‌రైన హిట్ ప‌డాల్సిన సంద‌ర్భం ఇది. ఇలాంటి టైమ్‌ లో త‌న‌కి ఉన్న చాక్లెట్‌ బోయ్ ఇమేజ్‌ ని క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు.
అంత‌కుముందు ఆ త‌రవాత చిత్రంలానే మ‌రో చ‌క్క‌ని హిట్‌ ని త‌న ఖాతాలో వేసుకోవాల‌ని అనుకుంటున్నాడు. కాబ‌ట్టి కోలంబ‌స్ అత‌డికి ఎంతో ఇంపార్టెంట్ మూవీ.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి సెన్సార్ అవ్వ‌నేలేదు. అఖిల్ సినిమా వ‌చ్చేశాక‌.. అనుకున్నారు కాబ‌ట్టి కాస్త ధీమాగా ఉన్న‌ట్టున్నారు. కానీ అఖిల్‌ ని వాయిదా వేస్తూ నాగార్జున ప్ర‌క‌ట‌న వ‌చ్చాక‌.. ఆలోచ‌న మారింది కాబ‌ట్టి బ్యాలెన్స్ ప‌నుల‌న్నీ పూర్తి చేసే హ‌డావుడిలో ఉన్న‌ట్టున్నారు. ఏదేమైనా ఈ సెల‌వుల్ని క్యాష్ చేసుకునే థింకింగ్ బావున్నా ..కంగారులో అస‌లు విష‌యం మ‌రిచి సినిమాలో కంటెంట్ లేకుండా చేస్తారేమో మేక‌ర్స్ ఆలోచించుకోవ‌డం మంచిది.