Begin typing your search above and press return to search.

సైలెంటుగా పెళ్లాడేస్తున్న స్వాతి!

By:  Tupaki Desk   |   13 Aug 2018 4:22 AM GMT
సైలెంటుగా పెళ్లాడేస్తున్న స్వాతి!
X
ట్యాలెంటెడ్ క‌ల‌ర్స్ స్వాతి ఉన్న‌ట్టుండి పెద్ద షాకిస్తోంది. ఇన్నాళ్లు స్వాతి ఏమైంది? అంటూ అభిమానులు ఒక‌టే ఉత్కంఠ‌గా ప్ర‌శ్నించేవారు. ఇక ఆ ప్ర‌శ్న‌ల‌న్నీ మూగ‌వోయిన‌ట్టే. ఎందుకంటే స్వాతి సైలెంటుగా త‌న బోయ్‌ ఫ్రెండ్ వికాస్‌ ని పెళ్లాడేస్తోంది. ఈనెల 30 సాయంత్రం 7.33 నుంచి ఈ జంట వివాహమ‌హోత్స‌వం హైద‌రాబాద్‌ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. పెళ్లి త‌ర్వాత కొచ్చిలో సెప్టెంబ‌ర్ 2న రిసెప్ష‌న్ కార్య‌క్ర‌మం ఎరేంజ్ చేశారు.

ఇంత‌కీ వ‌రుడెవ‌రు? అత‌డేం చేస్తారు? అంటే ఇవిగో వివ‌రాలు.. వ‌రుడు వికాస్ చాలాకాలంగా స్వాతికి స్నేహితుడు. కొంత‌కాలంగా వీరి ప్రేమ‌కు ఇరువైపుల కుటుంబ స‌భ్యుల నుంచి అంగీకారం ల‌భించిందిట‌. ఇది ఓ ర‌కంగా ల‌వ్ కం ఎరేంజ్ డ్ మ్యారేజ్‌. వికాస్ ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ పైలెట్‌. మ‌లేసియ‌న్ ఎయిర్‌ లైన్స్ - జ‌కార్తా (ఇండోనేషియా)లో ప‌ని చేస్తున్నారు. పెళ్లి త‌ర్వాత స్వాతి జ‌కార్తాకు వెళ్లిపోనుంద‌ని తెలుస్తోంది.

ఎనీవే.. వినేందుకు అభిమానుల‌కు కాస్తంత క‌ష్ట‌మే అయినా .. పెళ్లితో ఓ ఇంటిద‌వుతోంది కాబ‌ట్టి అది సంతోష‌మే. లైఫ్‌ లో హ్యాపీగా సెటిల‌వ్వాల‌నే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అభిమాన క‌థానాయిక‌ స్వాతికి శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. క‌ల‌ర్స్ అనే టీవీ కార్య‌క్ర‌మం ద్వారా ముద్దు ముద్దు మాట‌ల‌తో మురిపాల యాంక‌ర్‌ గా ఫేమ‌స్ అయిన స్వాతి అన‌తి కాలంలోనే తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో క‌థానాయిక‌గా ప్ర‌వేశించి చ‌క్క‌ని న‌టిగా పేరు తెచ్చుకుంది. అష్టాచెమ్మా - గోల్కొండ హైస్కూల్ చిత్రాల‌తో న‌టిగా చ‌క్క‌ని పేరు తెచ్చుకుంది. అటుపై తెలుగు - త‌మిళం - మ‌ల‌యాళం భాష‌ల్లో న‌టించి మెప్పించింది. స్వాతి న‌టించిన రీసెంట్ సినిమాలు త్రిపుర‌ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం అందుకోలేదు. ఈ త‌రుణంలోనే స్వాతి పెళ్లి గురించి పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు అధికారికం.. ఇక పెళ్లి ఫిక్సేన‌ని తెలుస్తోంది.