Begin typing your search above and press return to search.

నాలుగేళ్ళ తర్వాత టాలీవుడ్ కు తిరిగొచ్చిన చలాకీ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   30 Jun 2021 11:00 PM IST
నాలుగేళ్ళ తర్వాత టాలీవుడ్ కు తిరిగొచ్చిన చలాకీ హీరోయిన్..!
X
స్వాతి రెడ్డి అలియాస్ 'కలర్స్' స్వాతి త‌న‌దైన‌ శైలి నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 2018లో పైల‌ట్ వికాస్ వాసును పెళ్లి చేసుకున్న స్వాతి.. ఆ త‌ర్వాత తన భర్తతో కలిసి ఇండోనేషియాకు మ‌కాం మార్చేసింది. ఈ నేపథ్యంలో సినిమాలకు దూరమైన ఆమె.. అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా టచ్ లో వస్తూ ఉంటుంది. అయితే దాదాపు 4 ఏళ్ల తరువాత కలర్స్ స్వాతి తిరిగి టాలీవుడ్ కు వచ్చింది. 'పంచతంత్రం' అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.

ఇటీవలే 'పంచతంత్రం' సినిమాలో కలర్స్ స్వాతి కీలక పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా స్వాతి సెట్స్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది. పెళ్లి త‌ర్వాత కాస్త బొద్దుగా కనిపించిన స్వాతి.. సినిమా కోసం మళ్ళీ స్లిమ్ గా తయారైనట్లు ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది. హీరోయిన్ పాత్రలతో పాటు స్పెషల్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధపడిన స్వాతి సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతుందేమో చూడాలి.

కాగా, 'పంచతంత్రం' చిత్రాన్ని కొత్త దర్శకుడు హ‌ర్ష పులిపాక తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కలర్స్ స్వాతితో పాటుగా బ్రహ్మానందం - సముద్రఖని - శివాత్మిక రాజశేఖర్ - రాహుల్‌ విజయ్‌ - నరేష్‌ అగస్త్య ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. టికెట్‌ ఫ్యాక్టరీ మరియు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై అఖిలేష్‌ వర్ధన్‌ - సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.