Begin typing your search above and press return to search.
కలరిస్టు లేనిదే సినిమా లేదు
By: Tupaki Desk | 14 Aug 2015 5:11 PM ISTసినిమా 24 శాఖల్లో కలర్ గ్రేడింగ్ అనేది ఒక విభాగం. డిజిటల్ టెక్నాలజీ పెరిగాక ఈ విభాగానికి మరింత పని పెరిగింది. అయితే ఆశించినంత స్థాయిలో ఐడెంటిటీ దొరకడం లేదని ఓ కంప్లయింట్. ఇంకా ఈ విభాగానికి సరైన గుర్తింపు,ప్రోత్సాహం లభించడం లేదని చెబుతున్నాడు కలరిస్ట్ రంగా. ఇతగాడు బెంగళూర్ డేస్, అయో బింతె పుస్తకం చిత్రాలకు ఉత్తమ కలరిస్టుగా కేరళ ప్రభుత్వ అవార్డ్ అందుకున్నాడు. ఈ చిత్రాలతో పాటు లింగా, కాంచన, ఓకే బంగారం (ఓకే కన్మణి) వంటి చిత్రాలకు పనిచేశాడు. మణిరత్నం, కె.ఎస్.రవికుమార్, లారెన్స్ వంటి స్టార్ డైరెక్టర్ల తో పనిచేసిన రంగా... ఇప్పుడిప్పుడు కలరిస్ట్ అంటే ఎవరో బైటి ప్రపంచానికి తెలుస్తోందని అంటున్నాడు.
సినిమాలకు కలర్ గ్రేడింగ్ చేయడం చాలా ముఖ్యమైన జాబ్. కలరిస్టు లేకుండా సినిమా రిలీజ్ కి వెళ్లలేదు. కీలకమైన విభాగమిది. కాంచన వంటి డార్క్ కోటెడ్ చిత్రాలకు కలరింగ్ చేసేప్పుడు, ఓకే బంగారం లాంటి ఫీల్ ఉన్న సినిమాలకు పనిచేసేప్పుడు సందర్భాన్ని బట్టి కలర్ గ్రేడింగ్ మార్చాల్సి ఉంటుంది. ఇదంతా క్రియేటివిటీతో కూడుకున్నది అని చెప్పారాయన. కలరిస్టుల్ని తమిళనాడు ప్రభుత్వం గుర్తించే పనిలో ఉంది. అలాగే తెలుగు పరిశ్రమలోనూ కలరిస్టులకు గుర్తింపు పెరిగితే బావుంటుందని ఆశిస్తున్నానని రంగా చెప్పారు.