Begin typing your search above and press return to search.

`ఉప్పెన` నుంచి `రంగుల‌ద్దుకున్న ..` సాంగ్ రెడీ!

By:  Tupaki Desk   |   8 Nov 2020 11:50 AM GMT
`ఉప్పెన` నుంచి `రంగుల‌ద్దుకున్న ..` సాంగ్ రెడీ!
X
సాయి తేజ్ సోద‌రుడు ..మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ఉప్పెన‌. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వ‌హిస్తున్నారు. కృతిశెట్టి క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అవుతోంది.

ప్ర‌చారం ప‌రంగా ఓ మెట్టు పైనే ఉంది ఉప్పెన టీమ్. ఈ సినిమాలో నీ కన్ను నీలి సముంద్రం.. పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. వాస్తవానికి కరోనా వైరస్ సమస్య లేకపోతే ఏప్రిల్ తొలి వారంలో ఉప్పెన విడుదల కావాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఉప్పెనను సంక్రాంతికి థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

రంగుల‌ద్దుకున్న అంటూ దేవీశ్రీ ఆల‌పించిన సాంగ్ ని న‌వంబ‌ర్ 11న 4 పీఎం చిత్ర‌బృందం రిలీజ్ చేయ‌నుంది. అయితే ఈ పాట గురించి ఇంట్రో వీడియోలో సుకుమార్ త‌న ఫేవ‌రెట్ దేవీశ్రీ‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ పాట ప్ర‌త్యేక‌త ప్రేమికుల మ‌నోభావాల్ని ఆహ్లాదంగా ఉండే ఆలోచ‌న‌ల్ని ప్ర‌తిబింబించ‌డ‌మే. బాణిని వాణి డామినేట్ చేయ‌కుండా ప్లెజెంట్ గా ఉండ‌నుంద‌ని దేవీశ్రీ చెబుతున్నారు. 11వ తేదీ 4 పీఎం నుంచి ఈ పాట అభిమానుల‌కు అందుబాటులో ఉండనుంది. డోంట్ మిస్ సూప‌ర్ ఎండింగ్ అంటూ ప్ర‌చారం సాగిస్తోంది టీమ్.

ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో లాంచ్ అవుతోంది. మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.