Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో 'కలర్ ఫొటో' డైరెక్టర్..?

By:  Tupaki Desk   |   3 April 2021 7:00 AM IST
స్టార్ హీరోతో కలర్ ఫొటో  డైరెక్టర్..?
X
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తో పాటు పలు హిట్ సినిమాలకు రచన - దర్శకత్వ విభాగంలో వర్క్ చేసిన సందీప్‌ రాజ్‌.. ''కలర్ ఫోటో'' సినిమాతో దర్శకుడిగా మారాడు. సుహాస్‌ - సుహాస్ - ఛాందినీ చౌదరి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. యంగ్ డైరెక్టర్ సందీప్‌ రాజ్‌ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుని తొలి సినిమాతోనే అందరి ఎటెన్ష‌న్ అందుకున్నాడు. దీంతో ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో సినిమాలు చేయడానికి పలు పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో సందీప్ తన త‌దుప‌రి సినిమాని ఓ స్టార్ హీరోతో చేయ‌డానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది మ్

'కలర్ ఫోటో' సక్సెస్ తర్వాత సందీప్ రాజ్ కి ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వారు అడ్వాన్స్ ఇచ్చారట. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ చేసుకున్న సందీప్.. ఓ స్టార్ హీరో సినిమా చేయాలని చూస్తున్నాడని సమాచారం. ఆ స్టార్ హీరో ఎవ‌ర‌నే విష‌యం మీద ప్ర‌స్తుతానికి క్లారిటీ లేనప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే ఉండ‌బోతుందని టాక్. ప్రస్తుతం సందీప్ ఓ వైపు ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులు చూసుకుంటూనే మ‌రోవైపున 'ఆకాశవాణి' వంటి వేరే సినిమాలకు రచన - డైలాగ్స్ రాస్తున్నాడు. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించగా.. ఆ సిరీస్ ఆల్రెడీ రెడీ అయిపోయింద‌ని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ని విడుదల చేయడానికి స‌న్నాహాలు జరుగుతున్నాయి. మరి సందీప్ రాజ్ త్వరలోనే డైరెక్టర్ గా తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.