Begin typing your search above and press return to search.
'కోబ్రా' టీజర్: క్రైమ్స్ కి పాల్పడే జీనియస్ మ్యాథమెటిషియన్..!
By: Tupaki Desk | 9 Jan 2021 12:38 PM ISTవిలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తాజాగా ''కోబ్రా'' అనే మరో కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇందులో విక్రమ్ తనదైన శైలిలో విభిన్న గెటప్స్‌లో కనిపించబోతున్నాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి సందర్భంగా శనివారం 'కోబ్రా' టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
'కోబ్రా' టీజర్ చూస్తుంటే ఇదొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇందులో విక్రమ్ ఓ జీనియస్ మ్యాథమెటిషియన్ గా కనిపిస్తూ ప్రతీ ప్రాబ్లమ్ కి మ్యాథమాటికల్ సొల్యూషన్ ఉంటుందని పేర్కొంటున్నాడు. అలానే తన తెలివితో రకరకాల గెటప్స్ మారుస్తూ క్రైమ్స్ చేసేవాడిలా కనిపిస్తున్నాడు. అతన్ని పట్టుకునే ఇంటర్ పోల్ ఆఫీసర్ అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో ఇర్ఫాన్ పఠాన్ కనిపిస్తున్నాడు. దీంట్లో విక్రమ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్ - మృణాలిని - కనికా - పద్మప్రియ - బాబు ఆంటోనీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ టీజర్ కి ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం తన మార్కును తెలియజేస్తోంది. మొత్తం మీద 'కోబ్రా' టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిందని చెప్పవచ్చు. కరోనా కారణంగా ఆలస్యమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది.