Begin typing your search above and press return to search.
సీఎం జగన్ సహాయం మరువలేనిది - రామ్ చరణ్
By: Tupaki Desk | 20 Dec 2020 12:15 PM ISTకరోనా.. ఈ శతాబ్దపు అతిపెద్ద ఉత్పాతం. కంటికి కనిపించని శత్రువుతో ప్రపంచం మొత్తం బహిరంగ యుద్ధం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అన్ని రంగాలూ కుదేలైపోయాయి. ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి.
తీరని సినిమా కష్టాలు..
ఇప్పుడిప్పుడే ప్రజలు తమ పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం అవుతున్నారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కూడా మళ్లీ గాడిన పడుతున్నాయి. కానీ.. సినీ రంగం పరిస్థితి మాత్రం ఇంకా చక్కబడలేదు. థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి లభించినా.. 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనతో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ధైర్యం చేయలేకపోతున్నారు. ప్రేక్షకులు కూడా గతంలో మాదిరి వస్తారా? రారా? అన్న సందేహం కంటిన్యూ అవుతూనే ఉంది. దీంతో.. ఏం చేయాలో పాలుపోవట్లేదు సినీ ఇండస్ట్రీకి.
జగన్ నిర్ణయంపై హర్షం..
ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు మేలు చేసే విధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిటర్లకు ‘సినిమాస్ రీస్టార్ట్ ప్యాకేజీ’ కింద ఏపీ ప్రభుత్వం చేయూతనివ్వడంతో సీఎంకు కృతజ్ఞతలు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
చరణ్ థ్యాంక్స్..
మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘ముఖ్యమంత్రి జగన్, ఏపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రోత్సాహకాలు చిత్రపరిశ్రమ పునరుద్ధరణకు ఎంతో సహాయపడతాయి.’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మెగాస్టార్ ట్వీట్ ను కూడా దీనికి జోడించారు.