Begin typing your search above and press return to search.

బట్టలిప్పించాడని దర్శకుడిపై కేసు

By:  Tupaki Desk   |   14 May 2016 12:34 PM IST
బట్టలిప్పించాడని దర్శకుడిపై కేసు
X
స్క్రిప్టులో ఉన్నదొక్కటి.. కానీ కెమెరా ముందు చేయమన్నది ఇంకోటి.. ఇలాంటి సందర్భాల్లో చాలామంది రాజీ పడిపోతారు. ఐతే ఆ హీరోయిన్ మాత్రం ఈ విషయాన్ని లైట్ తీసుకోలేదు. పైగా తనతో చేయించింది చాలా అభ్యంతరకరమైన సన్నివేశం మరి. దీంతో ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేసింది. దర్శకుడిపై కేసు కూడా పెట్టింది. ఇంతకీ ఎవరా దర్శకుడు.. ఏమా కథ.. తెలుసుకుందాం పదండి.

మలయాళంలో స్నేహజిత్ అనే ఓ చిన్న దర్శకుడున్నాడు. ఇతను తన కొత్త సినిమాకు ఓ హీరోయిన్ని ఎంచుకున్నాడు. ఐతే కథ చెప్పేటపుడు సన్నివేశాలన్నీ మామూలుగానే అనిపించాయి. కానీ షూటింగుకి వెళ్లాక దర్శకుడి దృష్టికోణం మారిపోయింది. ఆ హీరోయిన్‌ తో బట్టలు విప్పే సీన్ చేయించాడు. యూనిట్లో అందరి ముందు ఆ సీన్ చేయమనడంతో ఆమె సిగ్గుతో చచ్చిపోయింది. ఎలాగోలా ఆ సీన్ చేయనైతే చేసేసింది కానీ.. ఆమెను ఆ బాధ మాత్రం వెంటాడింది.

తెరమీద ఈ సన్నివేశం కనిపిస్తే ఎలా అని ఆలోచించి.. నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లిపోయింది. తనకు కథ చెప్పినపుడు లేని సన్నివేశాన్ని షూటింగ్ దశలో దర్శకుడు క్రియేట్ చేశాడని.. అందరి ముందు తన బట్టలు విప్పించాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని ఆమె కేసు పెట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్శకుడిని విచారిస్తున్నారు. కెమెరా ముందుకొచ్చాక హీరోయిన్లు దేనికైనా రెడీ అనుకునే దర్శకులకు ఇది చెంపపెట్టులాంటి వ్యవహారమే. ఆ హీరోయిన్ ఎవరన్నది వెల్లడి కాలేదు.