Begin typing your search above and press return to search.

బ్యాగీ ఫ్యాంటు చేనేత‌ చీరకు అంబాసిడ‌ర్లు వీళ్లు! ఇంత‌కీ ఈ స్టిల్ ఏ సినిమాలోనిది?

By:  Tupaki Desk   |   26 Jun 2021 2:30 AM GMT
బ్యాగీ ఫ్యాంటు చేనేత‌ చీరకు అంబాసిడ‌ర్లు వీళ్లు! ఇంత‌కీ ఈ స్టిల్ ఏ సినిమాలోనిది?
X
న‌డుము మీది వ‌ర‌కూ బాగా లాగి బిగించిన బ్యాగీ ఫ్యాంట్ స్టైల్ ఎప్పుడు పుట్టిందో తెలుసా? క్లాసిక్ డేస్ లోకి వెళితే ఓ మారు సీనియ‌ర్ ఎన్టీఆర్ తొడుక్కున్న ఆ ఫ్యాంటును చూశారు క‌దా? 1950 -60 కాలంలోనే ఈ బ్యాగీ స్టైల్ ఉంది. అయితే అప్ప‌ట్లో అది కాస్త హెవీ స్టైల్లో క‌నిపించేది. ఇక ఆ బ్యాగీ ఫ్యాంటు పైన తొడుక్కున్న లూజ్ చొక్కా చూశారు కదా.. బొమ్మ‌రిల్లు లో సిద్ధార్థ్ కుట్టించుకున్న చొక్కాలా ఉంది. కొత్తొక వింత పాతొక రోత అనుకుంటారు కానీ పాత ఫ్యాష‌న్స్ నే ఇప్పుడు కొత్త‌గా దించేస్తున్నారు.

మ‌రోవైపు ఈ క్లాసిక్ డే మెమ‌రీలో సావిత్రి రూపం ఎంత తీరుగ్గా పొందిగ్గా ఉందో చూస్తున్నారుగా.. కాట‌న్ చీరను ధ‌రించి నిండుగా ర‌వికెలో నాడు క‌థానాయిక‌లు ఎంతో ప‌ద్ధ‌తిగా ఉండేవారు. మ‌లైకా అరోరా.. జాన్వీ డేస్ కానే కావు అవి. సావిత్రి సరళమైన కాటన్ చీరను ధరించారు. ఆమె సహజ సౌందర్యం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తోంది. ఆకర్షణీయమైన ముఖం మధురమైన చిరునవ్వు జ‌న హృదయాలను తాకుతోంది. సావిత్ర‌మ‌మ్మ‌పై గౌరవం క‌లుగుతోంది.

ఎన్టీఆర్ - సావిత్రి జంట‌గా ఎన్నో క్లాసిక్ హిట్ చిత్రాల్లో న‌టించారు. తాజాగా వైర‌ల్ గా షేర్ అవుతున్న ఈ ఫోటో వైజ‌యంతి వాళ్లు మ‌హాన‌టి సినిమాని తీసిన‌ప్పుడు కూడా వైర‌ల్ చేశారు. ఇప్పుడు మ‌రోసారి పాప్ స్టార్ స్మిత షేర్ చేయ‌గా ఒక్క‌సారిగా ఎన్టీఆర్ అభిమానులు క్లాసిక్ డేస్ మెమ‌రీస్ లోకి వెళ్లిపోయారు. మిస్స‌మ్మ‌- దేవ‌త -ప‌ల్లెటూరు- కుటుంబ గౌర‌వం లాంటి నాటి మేటి క్లాసిక్స్ లో ఈ జంట న‌టించారు.

ఇంత‌కీ ఈ ఫోటో ఏ సినిమాలోనిది? ఏ సంవత్సరంలో తెర‌కెక్కిన సినిమానో తెలుసుకోగలరా? అని స్మిత తన ఫాలోవ‌ర్స్ ను అడిగారు. క్లాసిక్ ఫిల్మ్ మిస్సమ్మ సినిమాలోనిది ఈ ఫోటో. 1950 కాలం నాటిది..! అని చాలామంది అభిప్రాయ‌ప‌డ్డారు.