Begin typing your search above and press return to search.
ఆ శత్రువులు ఇద్దరూ కలిసి పోయారా...?
By: Tupaki Desk | 22 Aug 2020 11:45 AM ISTరాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు. అలానే చిత్ర పరిశ్రమలో కూడా అంతే. వీరు లైఫ్ లో మళ్ళీ కలిసే అవకాశమే లేదనుకున్నవారు కలిసి సినిమాలు కూడా తీస్తుంటారు. ఈరోజు తిట్టుకున్న వారు రేపు 'మా బెస్ట్' అంటూ ట్వీట్ పెడతారు లేదా ఓ సెల్ఫీ దిగి సోషల్ మీడియా మాధ్యమాలలో పోస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఇలాంటి సంఘటనే మన టాలీవుడ్ లో చోటుచేసుకుంది. ఇండస్ట్రీలో ఇద్దరు యువ హీరోలకి అస్సలు పడేది కాదు. సినీ నేపథ్యంలో లేకుండా ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న ఓ సీనియర్ యువ హీరో.. ఓ జూనియర్ యువ హీరోకి అనుకోకుండా మనస్పర్థలు ఏర్పడ్డాయి.
కాగా ఓ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమా టైమ్ లో వచ్చిన చిన్న గొడవ కారణంగా ఈ ఇద్దరు హీరోల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గమనేది. అప్పటి నుంచి సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్స్ లో కూడా వీరు ఒకే స్టేజిని పంచుకోలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా తమ సన్నిహితుల దగ్గర ఒకరి పేరు ఒకరు పొరపాటున కూడా తీసేవారు కాదు. అయితే ఇద్దరు హీరోలు ఇంతవరకు బహిరంగంగా తిట్టుకున్నది లేదు.. అలా అని వీరిద్దరూ కలిసి కనిపించిన సందర్భాలు కూడా లేవు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి జూనియర్ యువ హీరో సీనియర్ యువ హీరో సినిమాకి విషెస్ చెప్పాడు.
ఈ క్రైసిస్ టైమ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి సదరు హీరో తీసుకున్న టఫ్ డెసిషన్ ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. దీనికి సంతోషించిన హీరో స్వయంగా యువ హీరోకి కాల్ చేసి మరీ థ్యాంక్స్ చెప్పాడట. మరి ఇప్పుడే ఫ్రెష్ గా చిగురించిన వీరిద్దరి ఫ్రెండ్ షిప్ రాబోయే రోజుల్లో ఓ మల్టీస్టారర్ లో నటించే రేంజ్ కి వెళ్తుందేమో అని ఇండస్ట్రీలో కామెంట్స్ మొదలైపోయాయి.