Begin typing your search above and press return to search.

క్రేజీ ప్రాజెక్ట్ దర్శకనిర్మాతల మధ్య పారితోషికం గొడవ‌...!

By:  Tupaki Desk   |   8 Oct 2020 8:00 PM IST
క్రేజీ ప్రాజెక్ట్ దర్శకనిర్మాతల మధ్య పారితోషికం గొడవ‌...!
X
కరోనా క్రైసిస్ నష్టాల నుంచి బయటపడటానికి నటీనటులు సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్స్ లో 20 శాతం కోత విధించనున్నట్లు యాక్టివ్‌ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)తో ఒప్పందం కుదిరిందని.. పారితోషకాల తగ్గింపు నిర్ణయానికి సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ కోరింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒకరు రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం కుదరదని తెగేసి చెప్తున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెళ్తే ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడు. గతంలో ఆ డైరెక్టర్ తో ఓ సినిమాని నిర్మించిన యంగ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది.

అయితే ఏడు నెలలుగా సినిమా షూటింగ్ ఆగిపోయి.. ఫైనాన్స్ తెచ్చిన డబ్బులకు ఇంట్రెస్ట్ కట్టుకోలేక సదరు నిర్మాత ఇబ్బందులు పడుతున్నాడట. అయితే ఇప్పుడు 20 శాతం కోత విధించమని గిల్డ్ చెప్పడంతో ఆ డైరెక్టర్ ని రెమ్యూనరేషన్ తగ్గించుకోమని ప్రొడ్యూసర్ అడిగారట. అయితే దానికి ఒప్పుకునేదే లేదని ఆ డైరెక్టర్ అంటున్నారట. ఎందుకంటే గత చిత్రం ప్లాప్ అవడంతో ఆల్రెడీ తానే స్వ‌యంగా త‌క్కువ పారితోషికానికి ఈ సినిమా ఒప్పుకున్నానని.. ఇప్పుడు మళ్ళీ 20 శాతం తగ్గించుకోమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాడట. ఇప్పుడు ప్రొడ్యూసర్ - డైరెక్టర్ మధ్య జరుగుతున్న ఈ పంచాయతీ హీరో దగ్గరకు వెళ్లే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. మరి సీనియర్ హీరో ఈ దర్శకనిర్మాతల మధ్య ఏర్పడిన పారితోషకం గొడవ‌ని సర్దుమణిగేలా చేసి సినిమాపై ఎఫెక్ట్ పడకుండా చూసుకుంటాడేమో చూడాలి.