Begin typing your search above and press return to search.

మాస్ట్రో రిలీజ్ తేదీపై ఫుల్ క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   27 Aug 2021 5:35 AM GMT
మాస్ట్రో రిలీజ్ తేదీపై ఫుల్ క్లారిటీ వ‌చ్చిన‌ట్టేనా?
X
సెకండ్ వేవ్ అనంత‌రం థియేట‌ర్లు తెర‌వ‌డంతో నిర్మాత‌లు త‌మ సినిమాల్ని ఒక‌టొక‌టిగా రిలీజ్ చేసేందుకు తేదీల్ని లాక్ చేస్తున్నారు. కొంద‌రు ఓటీటీల‌కు వెళుతుంటే మ‌రికొంద‌రు థియేట్రిక‌ల్ రిలీజ్ ల‌కే ప్రాధాన్య‌త‌నిచ్చారు.

అయితే ఇటీవ‌ల ప‌లు సినిమాల రిలీజ్ తేదీల విష‌యంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఒకే రిలీజ్ తేదీని ప్ర‌తి ఒక్క‌రూ లాక్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డంతో ఈ గంద‌ర‌గోళం మ‌రింత‌గా క‌నిపించింది. సెప్టెంబ‌ర్ 10న వినాయ‌క చ‌వితిని పుర‌స్క‌రించుకుని వ‌రుస‌గా మూడు సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది.

వీటిలో నాగ‌చైత‌న్య - సాయిప‌ల్ల‌వి- క‌మ్ముల సినిమా ల‌వ్ స్టోరీ సెప్టెంబ‌ర్ 10న థియేట్రిక‌ల్ రిలీజ్ కి రెడీ అయ్యింది. అదే రోజు కంగ‌న‌ త‌లైవి కూడా రిలీజ్ కానుంది. హీరో నితిన్-తమన్నా-న‌భా న‌టేష్ ప్ర‌ధాన‌పాత్రల్లో నటించిన మాస్త్రో ఓటిటి రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఈ సినిమా 9న లేదా 10 హాట్ స్టార్ లో విడుదల అవుతుందనే వార్తలొచ్చినా ఆ త‌ర్వాత క్లారిటీ మిస్స‌య్యింది. ట‌క్ జ‌గ‌దీష్ అదే రోజు ఓటీటీలో విడుద‌ల‌వుతుంద‌ని క‌థ‌నాలొచ్చినా ఇప్పటికీ తేదీపై క్లారిటీ మిస్స‌య్యింది.

ఇదిలా ఉండ‌గానే సెప్టెంబ‌ర్ 9న రావాల్సిన మాస్ట్రో వాయిదా వేశార‌ని .. నితిన్ బృందం మాస్ట్రో కొత్త రిలీజ్ తేదీని లాక్ చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇత‌రుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా సెప్టెంబ‌ర్ 9 వ తేదీని స్కిప్ కొట్టి సెప్టెంబ‌ర్ 17న హాట్ స్టార్ లో విడ‌ద‌ల చేసేందుకు రంగం సిద్ధం చేశార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ల‌వ్ స్టోరి- ట‌క్ జ‌గ‌దీష్ రిలీజ్ తేదీల‌ను దృష్టిలో పెట్టుకుని హాట్ స్టార్ ని అభ్య‌ర్థించి కొత్త తేదీ కోసం ఒప్పించార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్న‌ది మాస్ట్రో టీమ్ వెల్ల‌డించాల్సి ఉంటుంది.

కంటెంట్ ప‌రంగా డౌట్ లేని సినిమా

యూత్ స్టార్ నితిన్- త‌మ‌న్నా- న‌భా న‌టేష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన `మాస్ట్రో` రిలీజ్ డైల‌మా క్లియ‌ర్ కానుంద‌ని స‌మాచారం. మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా.. శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో సెప్టెంబ‌ర్ లో విడుదలకు సిద్ధమ‌వుతోంది. స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం నితిన్ -త‌మ‌న్నా ల‌ కొత్త పోస్టర్ ను విడుదల చేయ‌గా చ‌క్క‌ని స్పంద‌న వచ్చింది. నితిన్ .. త‌మ‌న్నా మ‌ధ్య స‌న్నివేశాలు ర‌క్తి క‌ట్టిస్తాయ‌ని యూనిట్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే మిల్కీ వైట్ బ్యూటీ రొటీన్ కి భిన్నంగా ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర‌ను పోషించార‌ని స‌మాచారం.

నితిన్ స‌ర‌స‌న‌ న‌భా క‌థానాయిక‌గా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే నితిన్ .. న‌భా పోస్ట‌ర్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్ట‌ర్లు టీజ‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. మునుముందు మ‌రింత‌గా వైర‌ల్ గా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.

అక్టోబ‌ర్ రిలీజ్ కండీష‌న్ వ‌ల్ల కాస్త వేచి చూసి ఇప్ప‌టికి రిలీజ్ తేదీని ఫైన‌ల్ చేసారు. తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల పార్కింగ్ ఫీజు స‌హా ప‌లు వెసులుబాట్ల‌కు ప్ర‌భుత్వం అంగీక‌రించింది. అటు ఏపీలోనూ టిక్కెట్టు రేట్ల‌పై సీఎం జ‌గ‌న్ తో మెగాస్టార్ భేటీకి స‌మ‌య‌మాస‌న్న‌మైంది. అయినా మాస్ట్రోని ఓటీటీలోనే రిలీజ్ చేస్తుండ‌డం హాట్ టాపిక్ గా మారింది. త‌మ కంటెంట్ ని ఏ వేదిక‌పై అయినా రిలీజ్ చేసుకునే హ‌క్కు నిర్మాత‌కు ఉంటుంద‌ని డి.సురేష్ బాబు స‌హా ప‌లువురు సినీపెద్ద‌లు తీర్మానించారు. తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ అక్టోబ‌ర్ ఎండింగ్ రూల్ ని ఇత‌రులు ధిక్క‌రించారు. అందుకే ఇప్పుడు స్వేచ్ఛ‌గా సినిమాల‌న్నీ ఒక‌టొక‌టిగా రిలీజ‌వుతున్నాయి.