Begin typing your search above and press return to search.

'య‌శోద‌'లో స‌మంత రోల్ పై క్లారిటీ

By:  Tupaki Desk   |   30 Dec 2021 8:45 AM GMT
య‌శోద‌లో స‌మంత రోల్ పై క్లారిటీ
X
స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో `య‌శోద` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. హ‌రి-హ‌రీష్ అనే ఇద్ద‌రు కొత్త కుర్రాళ్లు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ య‌శోద‌లో స‌మంత రోల్ ఎలా ఉంటుంది? య‌శోద కంటెంట్ ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ది ఎక్క‌డా లీక్ అవ్వ‌లేదు. తాజాగా సామ్ పాత్ర వివ‌రాలు లీక్ అయ్యాయి. ఇందులో స‌మంత న‌ర్సు పాత్రలో క‌నిపిస్తోంది. ఆ పాత్ర చుట్టూనే క‌థ అంతా తిరుగుతుంద‌ని ఇది స‌స్సెన్స్ థ్రిల్ల‌ర్ చిత్రంగా ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని టాక్ వినిపిస్తోంది. స‌మంత పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఛాలెంజింగ్ గా ఉంటుంద‌ని.. థ్రిల్ల‌ర్ అంశాలు.. ట్విస్టులు ఊహ‌కంద‌ని విధంగా ఉంటాయని.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క‌థ సాగుతుంద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే మొద‌టి షెడ్యూల్ ని కేర‌ళ‌లో పూర్తి చేసారు. మ‌రో షెడ్యూల్ తో షూటింగ్ పూర్త‌వుతుంద‌ని స‌మాచారం. అన్ని ప‌నులు పూర్తి చేసి స‌మ్మ‌ర్ కానుక‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్న‌ట్లు స‌మాచారం. స‌మంత‌కి ఇది రెండ‌వ లేడీ ఓరియేంటెడ్ చిత్రం. గ‌తంలో `ఓ బేబి` లో న‌టించింది. ఇందులో క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో ఆద్యంత ఆక‌ట్టుకుంది. ఈ సినిమా యావ‌రేజ్ గా ఆడింది. న‌టిగా స‌మంత‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇక `య‌శోద‌`తో ఎంత‌గా రీచ్ అవుతుందో చూడాలి.

ఇంకా స‌మంత చేతిలో మరికొన్ని తెలుగు..హిందీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అలాగే ఓ అంత‌ర్జాతీయ చిత్రంలోనూ న‌టించ‌నుంది. రాజ్ అండ్ డీకే తో మ‌రో వెబ్ సిరీస్ కోసం రెడీ అవుతోంది. ఇలా సామ్ న‌టిగా బిజీగానే ఉంది. ఇటీవ‌లే స‌మంత పాన్ ఇండియా చిత్రం `పుష్ప` లో ఐటం పాట‌లో న‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. `ఊ అంటావా మావ‌..ఊఊ అంటావా` పాట‌తో ఒక్క‌సారిగా అభిమానుల‌ను ఓ ఊపు ఊపేసింది. ఈ పాట యూట్యూబ్ స‌హా సోష‌ల్ మీడియాల్లో యాప్ ల‌లో వైర‌ల్ గా దూసుకెళ్లింది. ప్ర‌స్తుతం వార్తా చానెళ్లు పొలిటిక‌ల్ సెటైర్ల‌కు బ్యాక్ గ్రౌండ్ గా ఉప‌యోగించేస్తున్నాయ్. ఇక ఓబేబిలో వృద్ధ గెట‌ప్ తో ఆక‌ట్టుకున్న సామ్ త‌దుప‌రి హాటెస్ట్ న‌ర్స్ గా క‌నిపించ‌నుందా? అంటూ ఊహాగానాలు సాగుతున్నాయి.