Begin typing your search above and press return to search.

భారీ బ‌డ్జెట్ సినిమాలు చెప్పిన డేట్ కి రావడం కష్టమే...!

By:  Tupaki Desk   |   25 April 2020 3:00 PM IST
భారీ బ‌డ్జెట్ సినిమాలు చెప్పిన డేట్ కి రావడం కష్టమే...!
X
లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్లపై ఆంక్షలు తొలగించిన తర్వాత ఇప్పటికే కంప్లీట్ అయిన సినిమాలు రిలీజ్ కి క్యూ కడతాయి. కానీ స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఇప్పుడప్పుడే విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఖచ్చితంగా భారీ బడ్జెట్ సినిమాల విడుదల విషయాల్లో చాలా మార్పులు చోటు చేసుకొనే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మల్టీ ఫ్లెక్సులు, థియేటర్స్ మూసేశారు. టాలీవుడ్ లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న చిత్రాలు తమ షూటింగ్ లను నిలుపుదల చేసుకోగా.. విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ పోస్టుపోన్ చేసుకున్నాయి. ఇప్పుడు ముందుగా 21రోజులు విధించిన లాక్ డౌన్ ఇప్పుడు మే నెల దాకా పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడప్పుడే థియేటర్లు తెరుచుకునేలా కనబడటం లేదు. ఇప్పటికే విడుదల తేదీలను వాయిదా వేసుకున్న సినిమాలు ఇంకొన్ని రోజులు ముందుకెళ్లిపోనున్నాయి. అయితే ఇప్పటికే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు థియేటర్ల మీద ఆంక్షలు ఎత్తేసిన వెంటనే సినిమాలు అన్నీ థియేటర్లలోకి రావాలని చూస్తున్నాయి. అయితే చిన్న సినిమాల వరకు అయితే అవి ఎప్పుడు రిలీజ్ అయినా ఓకే. కానీ పెద్ద సినిమాల విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేసేలా ఉన్నారు.

ఇప్పటికే కొంతమేరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న స్టార్ హీరోల సినిమాలు.. లాక్ డౌన్ తర్వాత మిగతా చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేసినప్పటికీ వాటిని వెంటనే విడుదల చేసే అవకాశాలు మాత్రం లేవు. ఎందుకంటే థియేట‌ర్స్ లో ఆకుపెన్సీపై.. టిక్కెట్ల విక్ర‌యంపై ప్ర‌భుత్వం ఆంక్ష‌లు పెట్టే అవ‌కాశం ఉంది. అలాంటి స‌మ‌యంలో భారీ సినిమాలు రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవ్వ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. సినిమా ఒక వారం రోజులు మాత్రమే థియేటర్లలో ఉంటున్న ఈ రోజుల్లో బ్రేక్ ఈవెన్ కోసం అన్ని రోజులు థియేటర్లలో సినిమా ఉండే అవకాశం లేదు. దీని వల్ల భారీ బడ్జెట్ సినిమాలు నష్టాలను చవి చూసే అవకాశం ఉంది. పైగా డిస్ట్రీబ్యూట‌ర్లు కూడా సినిమాకు నిర్మాత‌లు డిమాండ్ చేసే రేంజ్ లో డ‌బ్బులు ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు కనబడటం లేదు. దీనివల్ల ఆదాయం మొత్తం థియేట‌ర్స్ నుంచి రావాల్సి ఉంటుంది. ఇదే గ‌నుక జ‌రిగితే 'ఆర్ ఆర్ ఆర్' 'పుష్ప‌' 'కేజీఎఫ్' వంటి సినిమాలు రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం మీద రాబోయే రోజుల్లో భారీ బ‌డ్జెట్ సినిమాల రిలీజుల్లో మాత్రం చాలా మార్పులు వ‌స్తాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నాలు వేస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమలో అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేసే అవకాశముందని చెప్పవచ్చు.