Begin typing your search above and press return to search.
మెగా 'వేదాళం' గురించి మరింత స్పష్టత
By: Tupaki Desk | 12 Oct 2020 7:00 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ కారణంగా అంతా తలకిందులు అయ్యింది. చిరంజీవి ఆచార్య తర్వాత వరుసగా సినిమాలు చేయాలనుకున్నారు. ఆచార్య ఆలస్యం అయినా తదుపరి సినిమాలు అస్సలు ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకున్నారు.
ఆచార్య కాకుండా మరో మూడు సినిమాలను చిరంజీవి చేయబోతున్నారు. అందులో మొదటగా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం రీమేక్ లో చిరంజీవి నటించబోతున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ రీమేక్ విషయమై గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ రీమేక్ గురించి గురించి మరింత స్పష్టత వచ్చింది.
వేదాళం సినిమాలో హీరో పాత్ర సోదరి పాత్ర చాలా కీలకం. అందుకే తెలుగు వేదాళం సినిమాలో చెల్లి పాత్రను సాయి పల్లవితో చేయించబోతున్నారు. ఇప్పటికే చిరంజీవికి చెల్లిగా సాయి పల్లవి నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆ విషయమై స్పష్టత వచ్చేసింది. ఇక ఈ రీమేక్ కు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించనుండగా బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డూడ్లీ వర్క్ చేయబోతున్నాడు.
వేదాళం రీమేక్ ను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలని మెహర్ రమేష్ కు చిరంజీవి సూచించారట. సినిమాను వచ్చే ఏడాది దసరా వరకు విడుదల చేయాలనే పట్టుదలతో చిరంజీవి మరియు మేకర్స్ ఉన్నారట. ఈ రీమేక్ తర్వాత లూసీఫర్ రీమేక్ ను వినాయక్ దర్శకత్వంలో చేయనున్న చిరు ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కూడా ఇప్పటికే కమిట్ అయ్యారు.