Begin typing your search above and press return to search.

MB vs NBK కెప్టెన్సీ ఆలోచ‌నల్లో క్లారిటీ ఏదీ?

By:  Tupaki Desk   |   23 Aug 2020 11:30 AM IST
MB vs NBK కెప్టెన్సీ ఆలోచ‌నల్లో క్లారిటీ ఏదీ?
X
ప‌రిశ్ర‌మ‌లో ఎంతో అనుభ‌వం ఘ‌డించిన సీనియ‌ర్ హీరోల్లో దర్శ‌క‌త్వం ఆశ‌లు చాలా కామ‌న్. చిరంజీవి.. బాల‌కృష్ణ‌.. మోహ‌న్ బాబు .. వీళ్లంతా త్వ‌ర‌లో కెప్టెన్ సీటులో కూచునే వీలుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి.

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ త‌న వార‌సుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. తాజాగా క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ద‌ర్శ‌క‌త్వం వైపు ఆలోచిస్తున్నార‌న్న గుస‌గుస‌లు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి. ఒక పెద్ద వార్త చెబుతా! అంటూ ఆయ‌న కూడా ఊరించ‌డంతో అది ఆయ‌న డైరెక్టోరియ‌ల్ డెబ్యూ గురించి చెబుతార‌ని అనుకున్నారు. కానీ ఏదీ చెప్ప‌లేదు ఇంకా.

వినాయక చవితి సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో .. మోహన్ బాబు ఓ సినిమాకు దర్శకత్వం వహించాలనే ఆలోచ‌న ఉంద‌ని స్వ‌యంగా తెలిపారు. నేను ఇప్పటికీ దీనిని పరిశీలిస్తున్నాను అంటూ ఆయ‌న వ్యాఖ్యానించ‌డాన్ని బ‌ట్టి ఇంకా ఏ ప్రాజెక్టు అనేది క్లారిటీ లేద‌నే అర్థ‌మ‌వుతోంది. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మనం చాలా ఉద్దేశపూర్వకంగా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని ఆయన చెప్పారు.

కెరీర్ ముచ్చ‌ట చెబుతూ.. సూర్య `ఆకాశం నీ హ‌ద్దురా`లో కీల‌క పాత్ర పోషించాన‌ని తెలిపిన ఎంబీ.. `రావణుడు` అనే పురాణ పౌరాణిక చిత్రంలో తాను ప్రధాన పాత్ర పోషించనున్నట్లు వెల్లడించారు. `సన్ ఆఫ్ ఇండియా` చిత్రం దేశంలో అత్యధికులు మాట్లాడుకునే చిత్ర‌మ‌వుతుంద‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ ప్రారంభం కానుంది.