Begin typing your search above and press return to search.
లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్ పై క్లారిటీ
By: Tupaki Desk | 9 Sept 2021 8:00 AM ISTలేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా ప్రస్తుతం సౌత్ లో వరుసగా సినిమాలు చేస్తోంది. ఈమె హీరోయిన్ గా సౌత్ లోనే అత్యధిక పారితోషికం తీసుకుని నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో ఈమె షారుఖ్ ఖాన్.. అట్లీల మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. టాలీవుడ్ లో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నయన్ ఎంపిక అయ్యింది అనేది టాక్. నయన్ ఓకే అనాలే కాని వరుసగా ఆమె ముందు పెద్ద పెద్ద సినిమాలు వచ్చి క్యూ కట్టడానికి సిద్దంగా ఉంటాయి. ఆచి తూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్న ఈ అమ్మడు ఈ ఏడాది డిసెంబర్ తర్వాత సినిమాలు చేయదు అనేది టాక్. అప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి మళ్లీ కొత్త సినిమాల విషయంలో బ్రేక్ వేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రియుడు విఘ్నేష్ శివన్ తో డిసెంబర్ లో పెళ్లికి సిద్దం అవుతున్న నయనతార ముందు ముందు రాబోతున్న ఆఫర్ల విషయంలో ఆసక్తిగా లేదని.. అసలు పెళ్లి తర్వాత హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా బిజీ అవ్వాలని భావిస్తుంది అంటూ ఇటీవల ఒక తమిళ మీడియా కథనాన్ని ప్రచురితం చేసింది. తమిళంలో ఈమె కొత్తగా సినిమాలు కమిట్ అవ్వక పోవడానికి కారణం అదేనా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో విఘ్నేష్ శివన్ సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నయనతార పెళ్లి తర్వాత సినిమాలను కంటిన్యూ చేస్తుందని తమిళ మీడియా మళ్లీ కథనాలు రాస్తోంది.
నయనతార కు ఉన్న లేడీ సూపర్ స్టార్ క్రేజ్ ను నిలుపుకునేందుకు ఆ స్థాయి సినిమాలను కమిట్ అవ్వాలనే ఉద్దేశ్యంతో కాస్త ఆలస్యం చేస్తుందని.. అంతే తప్ప సినిమా లపై ఆసక్తి లేక కాదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పాటు వచ్చే ఏడాది ఆమె కొత్తగా కమిట్ అవ్వబోతున్న సినిమాలు కూడా చేయబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమా కాకుండా మరో సినిమా కూడా నయనతార చేయనుందని అంటున్నారు.
పెళ్లి తర్వాత వీరి కాంబోలో మూవీ ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నయనతార ముందు ముందు మరిన్ని మంచి పాత్రలు సినిమాలు చేస్తుందని.. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాల్సిన అవసరం లేదని ఆమె భావిస్తుందని తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు. మొత్తానికి నయనతార డిసెంబర్ లో పెళ్లి తర్వాత సినిమా కెరీర్ కు గుడ్ బై చెప్పబోతుంది అనే వార్తలకు క్లారిటీ వచ్చింది.