Begin typing your search above and press return to search.

చిరు 152 - ఇదుగో క్లారిటీ

By:  Tupaki Desk   |   6 Dec 2018 11:05 AM IST
చిరు 152 - ఇదుగో క్లారిటీ
X
మెగాస్టార్ చిరంజీవి సైరా తర్వాత చేయబోయే సినిమా గురించి అధికారిక వార్తలు లేవు కానీ లీకవుతున్న న్యూస్ మాత్రం నమ్మదగినవిగానే ఉన్నాయి. చిరు కొరటాల శివ కు ఓకే చెప్పాడన్న వార్త గత రెండు నెలలు గా చక్కర్లు కొడుతూనే ఉంది. దానికి తగ్గట్టు కొరటాల శివ భరత్ అనే నేను తర్వాత ఎవరికీ కమిట్మెంట్ ఇవ్వలేదు. ఒకరిద్దరు స్టార్ హీరోలు పిలిచినా ఇప్పుడు ఖాళీగా లేనంటూ సున్నితంగా తిరస్కరించాడు. ప్రస్తుతం మహర్షి చేస్తున్న మహేష్ బాబు నుంచి కూడా కాల్ వచ్చినప్పటికీ మంచి లైన్ రెడీ అయ్యాక వచ్చి కలుస్తానని చెప్పినట్టు టాక్ ఉంది.

అయితే కొద్ది రోజుల నుంచి కొరటాల శివతో చిరు చేయాలనుకున్న సినిమా పోస్ట్ పోన్ అవుతుందని బాగా సమయం పట్టేలా ఉండటంతో శివ మళ్ళి ప్రిన్స్ వైపే మొగ్గు చూపుతున్నాడని కొన్ని కథనాలు వచ్చాయి. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు అవన్నీ అబద్ధమేనని తెలిసింది. కొరటాల శివ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ లాక్ చేసాడని చిరు తో వీలు కుదిరినప్పుడల్లా దానికి సంబందించిన చర్చలు జరుపుతూనే అవసరమైన మార్పులు చేర్పులు చేసుకుంటున్నట్టు సమాచారం.

అయితే షూటింగ్ ఎప్పుడు మొదలుకావచ్చు అనే దానికి మాత్రం 2019 ఫస్ట్ హాఫ్ లోనే అనే సమాధానం వస్తోంది. ఇందులో చిరు డ్యూయల్ రోల్ ఉంటుందని కొరటాల శివ మార్కు మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలు అన్ని ఉండేలా జాగ్రత్త వహిస్తున్నారని చెబుతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక హీరోయిన్ గా ఎంపికైనట్టు కూడా చెబుతున్నారు కాని ప్రస్తుతానికి గాసిప్ కిందే లెక్క. మొత్తానికి ఇవన్నీ పక్కన పెడితే కొరటాల శివ చిరంజీవి కాంబో గురించి వస్తున్న గాసిప్స్ కు తెరపడినట్టే అనుకోవాలి