Begin typing your search above and press return to search.

సైరాకు బిగ్ బి.. ఆచార్య‌కు చెర్రీనా?

By:  Tupaki Desk   |   13 April 2020 9:00 AM IST
సైరాకు బిగ్ బి.. ఆచార్య‌కు చెర్రీనా?
X
గురువుల‌కే గురువు స్టారాధి స్టార్ల‌కే గురువు.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ టాలీవుడ్ సినిమాకి అంగీక‌రించ‌డ‌మే గొప్ప అనుకుంటే ఆయ‌న సైరాకు ఓకే చెప్పి భ‌ళా అనిపించారు. అది కూడా త‌న స్నేహితుడు చిరంజీవి పిలుపు మేర‌కు త‌న‌ను గౌర‌వించి సైరా-న‌ర‌సింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్ర‌కు ఓకే చెప్పారు. ఉయ్యాల‌వాడ‌ న‌రసింహారెడ్డి ల‌క్ష్యసిద్ధి కి దిశా నిర్ధేశ‌నం చేసే గురువు గోసాయి వెంక‌న్న‌గా న‌టించారు అమితాబ్. ఆ పాత్ర సైరాకు వెయిట్ పెంచింది. ఉత్త‌రాదిన ఐడెంటిటీకి కార‌ణ‌మైంది.

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 151 వ చిత్రంలో గురువు పాత్ర‌లో అమితాబ్ న‌టించ‌డం ఆస‌క్తిక‌రం. ఇప్పుడు మెగాస్టార్ న‌టిస్తున్న 152వ సినిమాలోనూ అలా దిశానిర్ధేశ‌నం చేసే ఓ గురువు పాత్ర ఉందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఆ పాత్ర‌ను చేసేది ఎవ‌రు? అంటే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ని ఫైన‌ల్ చేశార‌ని ఇటీవ‌ల క‌థ‌నాలొచ్చాయి. అయితే చెర్రీ ఈ చిత్రంలో చిరుకి కొడుకుగా క‌నిపిస్తార‌ని.. ఆ పాత్ర మ‌ర‌ణిస్తుంద‌ని ప్ర‌చార‌మైంది. ఆ త‌ర్వాతా ర‌క‌ర‌కాల ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువడినా ఏదీ క‌న్ఫామ్ కానేలేదు. అలాగే చిరు గురువు అయితే చ‌ర‌ణ్ శిష్యుడు అని ఇంత‌కుముందే తుపాకి క‌థ‌నం వెల్ల‌డించింది. అయితే తాజాగా దానికి ద‌గ్గ‌ర‌గా మ‌రో భిన్న‌క‌థ‌నం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. చ‌ర‌ణ్ పాత్ర‌లో ఊహించ‌ని ట్విస్ట్ క‌ట్టిప‌డేస్తుంద‌ని తెలుస్తోంది. దాదాపు 30-40 నిమిషాల నిడివితో చెర్రీ పాత్ర ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నుందిట. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ యోధ జక్క‌న్న నుంచి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని క్లారిటీ వ‌చ్చేయ‌డంతో చెర్రీ పాత్ర‌పైనా చిత్రీక‌ర‌ణ ప్రారంభించాల‌ని కొర‌టాల భావిస్తున్నార‌ట‌. అందుకోసం నెల రోజుల కాల్షీట్ల‌ను బ్లాక్ చేశాడ‌న్న ముచ్చ‌ట వినిపిస్తోంది. గురువు పాత్ర అంటే ఎలాంటిది? అంటే ఎండోమెంట్ (దేవాదాయ‌) శాఖ లో అవినీతి జ‌ల‌గ‌ల్ని ఏరి వేసే క్ర‌మంలో చ‌ర‌ణ్ పాత్ర మ‌ర‌ణిస్తుంది. ఇక ఆ పాత్ర నిర్ధేశించిన ల‌క్ష్యాన్ని చిరు పూర్తి చేస్తార‌ట‌. ఒక కీల‌క ఘ‌డియ‌లో కీల‌క పాత్ర మ‌ర‌ణించ‌డంతో థియేట‌ర్ల‌లో ఎమోష‌న్ పొంగి పొర్లుతుంద‌ట‌. సైరాలో అమితాబ్ పాత్ర‌లా ఆచార్య‌లో చ‌ర‌ణ్ పాత్ర ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది. దాని కొన‌సాగింపును అంతే ఎగ్జ‌యిటింగ్ గా రోమాంచితంగా తెర‌కెక్కించాల‌న్న‌ది కొర‌టాల ప్లాన్. ఇప్ప‌టికే ఎమోష‌న‌ల్ సీన్స్ తో ర‌క్తి క‌ట్టించ‌డంలో కొర‌టాల అనుభ‌వం ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ కానుంద‌ని విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే చిరు స‌ర‌స‌న కాజ‌ల్ ని ఓకే చేశారు. చ‌ర‌ణ్ కోసం నాయిక‌ను వెత‌కాల్సి ఉంటుంది. మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే.